Movie News

వరదా… వరప్రసాద్ ఆగడం లేదు

బాక్సాఫీస్ వద్ద మన శంకరవరప్రసాద్ గారి తుఫాను కొనసాగుతోంది. మూడు రోజులకే నూటా యాభై కోట్ల మార్కుని దాటేసిన మెగాస్టార్ వీకెండ్ లోపు డబుల్ సెంచరీని టచ్ చేయడం ఖాయమే. మొదటి వారం కాకుండానే ఇంత ఊచకోత చూసి మెగాభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.

యుఎస్ లో థియేటర్ ఇష్యూస్ కొంతవరకు ఇబ్బందిగా మారినప్పటికీ రెండు మిలియన్ల మైలురాయిని అందుకున్న వరప్రసాద్, బుక్ మై షోలో వేగంగా 20 లక్షల టికెట్లు అమ్మిన తొలి రీజనల్ మూవీగా మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఏపీ తెలంగాణ బిసి సెంటర్లలో జరుగుతున్న విధ్వంసం అర్థం కావాలంటే ఎక్స్, ఇన్స్ టా వీడియోలు చూస్తే చాలు.

సలార్ లో ప్రభాస్ విలన్ మీదకు వెళ్తున్నప్పుడు పృథ్విరాజ్ సుకుమారన్ ని ఉద్దేశించి పక్కన ఉన్న వాళ్ళు వరదా వాడిని ఆపు అంటారు. ఇప్పుడు వరప్రసాద్ వ్యవహారం అచ్చం ఇలాగే ఉంది. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని చిరంజీవి ఈ స్థాయిలో కంబ్యాక్ ఇస్తారని ఎవరూ ఊహించలేదు.

అనిల్ రావిపూడి అనే బ్రాండ్ ఉన్నప్పటికీ జెన్ జీని ఇద్దరూ మెప్పించగలరా అనే డౌట్ కొన్ని వర్గాల్లో ఉండేది. వాటిని పూర్తిగా పటాపంచలు చేస్తూ ఇంత పెద్ద సునామి సృష్టించడం అనూహ్యం. పోటీ కనక కొంచెం తగ్గి ఉంటే చాలా చోట్ల ఏకంగా రాజమౌళి నెంబర్లనే టార్గెట్ చేసుకుని ఉండేవాళ్ళేమో. కానీ ఆ ఛాన్స్ మిస్.

ప్యాన్ ఇండియా టచ్ లేని సింగల్ లాంగ్వేజ్ మూవీ ఇంత రచ్చ చేయడం మాత్రం గొప్ప విషయమని చెప్పాలి. ఇక్కడ చెప్పిందంతా కొంత అతిశయోక్తిగా కొందరికి అనిపించవచ్చేమో కానీ ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో రాజమౌళి ఆస్కార్ దాకా ఎలాగైతే తీసుకెళ్తున్నారో, అలాగే ఇతర బాషల అవసరం లేకుండా ఒక ఫ్యామిలీ కంటెంట్ తో బ్లాక్ బస్టర్ ఎలా ఇవ్వాలో అనిల్ రావిపూడి చూపిస్తున్నాడు.

పండగ జోష్ ఇంకా మూడు రోజులు ఉంది. ఆదివారం దాకా ఈ జోరులో ఒక్క శాతం కూడా ఎలాంటి మార్పు ఉండదు. తర్వాత పెరిగిన టికెట్ల రేట్లు ఆంధ్రప్రదేశ్ లో సాధారణ స్థితికి వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు సెకండ్ రౌండ్ బ్యాటింగ్ ఉంటుంది.

This post was last modified on January 16, 2026 10:45 am

Share

Recent Posts

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

11 minutes ago

రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…

48 minutes ago

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

2 hours ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

3 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

5 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

5 hours ago