ఎవరెవరి దగ్గరికో వెళ్లి ఎన్నో నెరేషన్లు జరుపుకున్న ఎల్లమ్మ చివరికి దేవిశ్రీ ప్రసాద్ తెరంగేట్రానికి ఉపయోగపడటం ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. ముందు నాని అన్నారు. తర్వాత నితిన్ ఫిక్స్ అయ్యాడు. తమ్ముడు ఫలితం ప్రభావమో లేక తెర వెనుక ఇంకేదైనా కారణమో తెలియదు కానీ నిర్మాత దిల్ రాజు మనసు మార్చుకున్నారు.
కట్ చేస్తే ఊహించని విధంగా దేవిశ్రీ ప్రసాద్ తెరపైకి వచ్చాడు. ఇది రెండు నెలల క్రితమే లీకైన న్యూసే కానీ సంక్రాంతి పండగ సందర్భంగా అనౌన్స్ మెంట్ తో పాటు చిన్న టీజర్ వదిలారు. ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్, ఏఐ తరహా షాట్స్ ఉన్న వీడియోలో దేవి చాలా షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చాడు.
పొట్టేలు, గజ్జెల మువ్వలతో శబ్దం చేస్తూ, భుజానికి డప్పు కట్టుకుని, కాలికి రక్తం కారుతున్నా, పరుగులు పెడుతున్న ఒక యువకుడి పాదాలను రివీల్ చేస్తూ చివరిలో డిఎస్పి ఫేస్ ని సైడ్ కట్ నుంచి పరిచయం చేశారు. గ్రామ దేవత బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఎల్లమ్మలో దేవి జానపద కళాకారుడిగా నటించబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. టీజర్ చూస్తే అదే కనిపిస్తోంది.
సంగీత దర్శకులు హీరోలుగా నటించడం ఇప్పటి తరంలో ఎవరూ చేయలేదు. మణిశర్మ, రెహమాన్, కీరవాణి, ఇళయరాజా, దేవా, ఎస్ఏ రాజ్ కుమార్, తమన్ వీళ్ళందరూ ఎన్నో గొప్ప ఆల్బమ్స్ ఇచ్చినప్పటికీ మేకప్ వేసుకుని హీరోగా రాలేదు.
ఆ రకంగా చూసుకుంటే దేవిశ్రీ ప్రసాద్ చేస్తోంది అరుదైన ప్రయోగమే. సంగీత దర్శకుడిగా బిజీ ఉన్నప్పటికీ ఇప్పుడీ టైంలో ఇలాంటి రిస్క్ చేయడం విశేషమే. దర్శకుడు వేణు యెల్దండికి ఎల్లమ్మ చాలా కీలకం. బలగం తర్వాత చాలా కాలం వెయిట్ చేశారు. దిల్ రాజు ఈ ఓపికకు మెచ్చుకునే ప్రాజెక్టు సిద్ధం చేశారు.
స్టార్ల కోసం గట్టిగా ట్రై చేశారు కానీ రకరకాల కారణాల వల్ల పనవ్వలేదు. ఇప్పుడు ఫైనల్ గా దేవి చేతికి వచ్చింది. రా అండ్ రస్టిక్ విలేజ్ డ్రామాగా రూపొందుతున్న ఎల్లమ్మలో హీరోయిన్ ఎవరు, ఇతర టెక్నికల్ టీమ్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు.
This post was last modified on January 15, 2026 6:03 pm
ది రాజా సాబ్ ఫలితం గురించి మళ్ళీ చెప్పడానికి ఏం లేదు. ఏదైనా డిఫెండ్ చేసుకుందామన్నా ఆ అవకాశం లేకపోవడంతో…
సంక్రాంతి వచ్చిందంటే చాలు ఉభయ గోదావరి జిల్లాల్లో పచ్చటి పొలాలు..గొబ్బిళ్లు…కళ్లాపి జల్లి రంగురంగుల ముగ్గులు వేసిన లోగిళ్లు…వాటితో పాటు కోడి…
కారుణ్య మరణం…వైద్యం చేసినా బ్రతికే అవకాశం లేక చావు కోసం ఎదురు చూసే పేషెంట్ల కోసం వారి కుటుంబ సభ్యులు…
సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య స్నేహ భావమే ఉంటుంది. ఆ ఇద్దరు హీరోలు ఒకరినొకరు బావా…
మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ ఎలాంటి విధ్వంసం సృష్టించగలరో ‘మన శంకర వరప్రసాద్…
సంక్రాంతి వస్తే చాలు పతంగులు ఎగురవేసేందుకు చిన్నా, పెద్దా అంతా ఆసక్తి చూపుతుంటారు. అయితే, దారంతో కాకుండా చైనా మాంజాతో…