Movie News

రక్షణ మంత్రి చేతికి సినిమా స్క్రిప్టు

బాలీవుడ్ కాంట్రవర్శల్ క్వీన్ కంగనా రనౌత్ కొన్నేళ్లుగా వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తోంది. హిందీలో ‘క్వీన్’ దగ్గర్నుంచి ఆమె ఈ టైపు సినిమాల్లో బిజీ అయిపోయింది. ఆ తర్వాత ఆమె నుంచి రివాల్వర్ రాణి, సిమ్రన్, మణికర్ణిక లాంటి సినిమాలొచ్చాయి. ‘మణికర్ణిక’తో ఆమె బాక్సాఫీస్ పవర్ ఏంటో కూడా అందరికీ తెలిసింది. దాని తర్వాత దక్షిణాదిన జయలలిత జీవిత కథ ఆధారంగా ‘తలైవి’ సినిమా చేసింది. దీని తర్వాత ఆమె ఇటీవలే ‘తేజస్’ అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘తేజస్’ ఇండియ‌న్ నేవీ నేప‌థ్యంలో న‌డిచే క‌థ‌. యుద్ధాల స‌మ‌యంలో నేవీ సిబ్బంది చూపే ధైర్య సాహ‌సాల నేప‌థ్యంలో ఈ సినిమా న‌డుస్తుంది. స‌ర్వేష్ మేవారా అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందించ‌నుండ‌గా.. రోనీ స్క్రూవాలా యురి త‌ర్వాత నిర్మిస్తున్న చిత్ర‌మిది. కంగ‌నాది ఏదైనా నిజ జీవిత పాత్రా అన్న‌ది తెలియ‌ట్లేదు. ఐతే ఆమె ఓ సాహ‌స మ‌హిళ పాత్ర‌లో అయితే క‌నిపించ‌బోతోంద‌ని దీని ఫ‌స్ట్ లుక్‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టడానికి ముందు కంగనా అండ్ టీమ్ వెళ్లి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలవడం విశేషం.

డిఫెన్స్, నేవీ నేపథ్యంలో సినిమాలు ఎలా పడితే అలా తీసేస్తుండటంతో ఈ మధ్య ఆ విభాగాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కార్గిల్ యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా జాన్వి కపూర్ ప్రధాన పాత్రలో తీసిన ‘గుంజన్ సక్సేనా’ విషయంలో ఇలాంటి అభ్యంతరాలే వచ్చాయి. ఈ నేపథ్యంలో తర్వాత వివాదాలు ఎందుకని ఇప్పుడే క్లియరెన్స్ తెచ్చుకుంది కంగన బృందం. రాజ్‌నాథ్‌ను కలిసి ఆయన చేతిలో ‘తేజస్’ స్క్రిప్టును పెట్టేసింది కంగనా. ఈ మధ్య మోడీ సర్కారుకు బ్రాండ్ అంబాసిడర్‌లా మారిపోయిన కంగనాకు అక్కడి నుంచి క్లియరెన్స్ రావడం పెద్ద కష్టం కాకపోవచ్చు.

This post was last modified on December 14, 2020 2:01 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

5 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

5 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

6 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

6 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

7 hours ago