సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి తగ్గట్టు సర్దలేక డిస్ట్రిబ్యూటర్లు కిందా మీదా పడుతున్నారు. మన శంకరవరప్రసాద్ గారుకి అంచనాలకు మించిన బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ పోటెత్తున్నారు.
ముందుగా అగ్రిమెంట్ చేసుకున్న హాళ్లు సరిపోవడం లేదు. ఆన్ లైన్ బుకింగ్స్ కు తోడు కౌంటర్ అమ్మకాల జోరుగా ఉండటంతో రెండు మూడు రోజలకు సరిపడా అడ్వాన్స్ బుకింగ్స్ ముందస్తుగానే అయిపోతోంది. కానీ డిమాండ్ కు తగ్గట్టుగా స్క్రీన్లు పెంచే అవకాశాలు తక్కువగా ఉండటం నెంబర్ల మీద ప్రభావం చూపిస్తోంది.
రాజా సాబ్ ఫలితం తేలినప్పటికీ దాని కోసం చేసుకున్న ఒప్పందాలు, బ్రేక్ ఈవెన్ కోసం పెట్టుకున్న లక్ష్యాలు పెద్దగా ఉండటంతో ఇప్పటికిప్పుడు తీసేయలేని పరిస్థితి నెలకొంది. సెకండ్ వీక్ ఎంటరైతే తప్ప దీంట్లో ఎలాంటి మార్పు ఉండదని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు.
భర్త మహాశయులకు విజ్ఞప్తికి యునానిమస్ టాక్ రాకపోయినా రవితేజ గత చిత్రాలతో పోలిస్తే చాలా మెరగనే మాట బయటికి రావడంతో జనం చిన్నగా పెరుగుతున్నారు. గత డిజాస్టర్ల ప్రభావం మాస్ మహారాజా మీద బలంగా ఉంది. ఇక ఫ్రెష్ గా వచ్చిన అనగనగా ఒక రాజు సంగతి తేలాల్సి ఉంది. ఇక్కడితో స్టోరీ అయిపోలేదు.
సాయంత్రం నుంచి నారి నారి నడుమ మురారి షోలు స్టార్ట్ కాబోతున్నాయి. పాజిటివ్ వైబ్స్ బాగానే ఉన్నాయి. టాక్ వస్తే శర్వానంద్ కూడా బ్యాటింగ్ బ్యాచులో చేరిపోతాడు. ఆదివారం దాకా స్కూళ్లకు సెలవులున్నాయి. స్వంత ఊర్లకు వచ్చిన ఫ్యామిలీస్ శనివారం దాకా థియేటర్లనే ఎంటర్ టైన్మెంట్ ఆప్షన్ గా పెట్టుకుంటారు.
ఉత్తరాంధ్ర, నైజామ్ లో పెద్ద ఎత్తున ప్రేక్షకులు కనిపిస్తున్నారు. ఇప్పుడున్న సిచువేషన్ లో థియేటర్లు ఎవరికి ఎక్కువ పంచాలో అర్థం కావడం లేదని డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు. పైగా పోటీ వల్ల వాళ్లలో వాళ్ళకే కొట్లాటలు, వివాదాలున్నాయి. ఫస్ట్ ర్యాంక్ ఎవరో తేలిపోయింది కాబట్టి ఇక మిగిలిన స్థానాలు ఎవరివో చూడాలి.
This post was last modified on January 14, 2026 2:44 pm
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…