శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’తో అతను హిట్టు కొడతాడనే నమ్మకాలు కలుగుతున్నాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్‌గా కనిపించాయి. ఐతే ఈ సినిమాను ఇంకా బాగా ప్రమోట్ చేయాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పబ్లిసిటీ లేటుగా మొదలుపెట్టారు. తనకు హిట్ చాలా అవసరమైన దశలో శర్వా ప్రమోషన్ పరంగా ఇంకా చురుగ్గా ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అతనెందుకు అంత యాక్టివ్‌గా లేడనే విషయంలో కొంత సందేహాలు కలుగుతున్నాయి. దర్శక నిర్మాతలతో ఏమైనా చెడిందా అనే డౌట్లూ కొడుతున్నాయి. ఇదే విషయాన్ని నిర్మాత అనిల్ సుంకరను అడిగితే.. ఆ అనుమానాలను సింపుల్‌గా కొట్టిపడేశారు. శర్వాతో ఏ ఇబ్బందీ లేదని తేల్చేశారు.
సినిమాకు ప్రమోషన్ పరంగా సహకరించడంలో తాను పని చేసిన హీరోలందరిలో వన్ ఆఫ్ ద బెస్ట్ శర్వా అని అనిల్ సుంకర తేల్చేశారు. తాను ఇంతకుముందు శర్వాతో ‘మహాసముద్రం’ సినిమా కూడా తీశానని.. అప్పుడు కానీ, ఇప్పుడు కానీ అతను పూర్తిగా సహకరించాడని.. ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు.
శర్వా వేరే చోట ఉండడం వల్ల ప్రెస్ మీట్లో పాల్గొనలేదని.. ఈ సినిమా కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్నాడని.. ఈవెంట్లలో పాల్గొంటున్నాడని.. సినిమా కోసం ఎంత కష్టపడాలో అంతా పడుతున్నాడని అనిల్ స్పష్టం చేశారు. ‘నారీ నారీ నడుమ మురారి’ శర్వా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఫిలింగా నిలుస్తుందని.. తన సంస్థకూ ఘనవిజయాన్ని అందిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’ సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 5.49 షోలతో విడుదలవుతోంది. ఈ చిత్రంతో శర్వా సరసన సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు.
This post was last modified on January 13, 2026 2:29 pm
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…