ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం వల్ల వస్తున్న మొనాటనీని బ్రేక్ చేయడానికి ‘ది రాజా సాబ్’ తో ఒక కమర్షియల్ ప్రయోగం చేశారు. ఇందులో లవర్ బాయ్ గా, కామెడీ టైమింగ్ తో కొత్తగా కనిపించాలనే ప్రభాస్ ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.
ఫలితం ఎలా ఉన్నా, ప్రతిసారి ఏదో ఒక కొత్త లుక్ తో ఆడియన్స్ ని పలకరించాలనే ఆయన తాపత్రయాన్ని మెచ్చుకోవాల్సిందే. నిరంతరం వైలెన్స్, యాక్షన్ సినిమాలు చేయడం వల్ల వచ్చే గ్యాప్ కోసం ఈ సినిమా చేసినట్లు ప్రభాస్ స్వయంగా ఒప్పుకున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ ఇటలీలో విహారయాత్రలో ఉన్నారు. సంక్రాంతి సెలవులు ముగియగానే ఆయన మళ్ళీ ఇండియాకు తిరిగి వచ్చి పూర్తి ఫోకస్ తన తదుపరి ప్రాజెక్టులపై పెట్టనున్నారు. ఈ విరామం తర్వాత ఆయన మళ్ళీ తన కంఫర్ట్ జోన్ అయిన ‘వైలెన్స్ అండ్ వార్’ మోడ్ లోకి షిఫ్ట్ కాబోతున్నారు. వచ్చే నెల నుంచి ఆయన డైరీ మొత్తం భారీ షెడ్యూల్స్ తో నిండిపోనుంది. మొదట హను రాఘవపూడి ‘ఫౌజీ’ సెట్స్ లో కొన్ని రోజులు పాల్గొని, ఆ తర్వాత మిగతా చిత్రాలకు సమయం కేటాయించనున్నారు.
ఫిబ్రవరిలో ‘కల్కి 2898 AD’ పార్ట్ 2 కి సంబంధించిన ఒక మేజర్ షెడ్యూల్ జరగనుంది. ప్రధాన తారాగణం అంతా పాల్గొనే ఈ షెడ్యూల్ సినిమా అవుట్ పుట్ కి చాలా కీలకం. ఈ స్కై ఫై యాక్షన్ డ్రామా తర్వాత ప్రభాస్ పూర్తి స్థాయిలో సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీకి షిఫ్ట్ అవ్వనున్నారు. స్పిరిట్ కోసం ఎలాంటి బ్రేక్స్ లేకుండా కంటిన్యూస్ షెడ్యూల్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ ని మునుపెన్నడూ చూడని హై వోల్టేజ్ బోల్డ్ యాక్షన్ పాత్రలో చూడబోతున్నాం.
ప్రభాస్ కెరీర్ లో ‘స్పిరిట్’ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఆయనకు 25వ సినిమా. తన ల్యాండ్ మార్క్ మూవీగా స్పిరిట్ ను అందరికంటే ముందుగా థియేటర్లకు తీసుకురావాలని అనుకుంటున్నారు. అందుకే ఇతర సినిమాల కంటే ఈ ప్రాజెక్ట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వరుసగా కాల్షీట్లు సర్దుబాటు చేస్తున్నారు. ఒకవైపు ‘ఫౌజీ’ వార్ డ్రామా, మరోవైపు ‘స్పిరిట్’ రా యాక్షన్.. ఇలా ప్రభాస్ మళ్ళీ తన పాత పంథాలోకి వచ్చేస్తున్నారు.
రాజా సాబ్ ద్వారా లవర్ బాయ్ గా కనిపించి వినోదాన్ని పంచే ప్రయత్నం చేసినా, ప్రభాస్ అసలైన బలం మాత్రం యాక్షన్ సినిమాలే అని అందరికీ తెలుసు. అందుకే రాబోయే రోజుల్లో తన మార్క్ వైలెన్స్ తో బాక్సాఫీస్ వద్ద పలకరించబోతున్నాడు. పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టులన్నీ భారీ స్థాయిలో రూపొందుతున్నాయి. ఇక సంక్రాంతి తర్వాత మొదలయ్యే ఈ ప్రయాణం వచ్చే ఏడాది వరకు తీరిక లేకుండా కొనసాగనుంది. ఇలా వైవిధ్యమైన సినిమాలతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద తన జోరును ఎలా కొనసాగిస్తారో చూడాలి.
This post was last modified on January 11, 2026 5:53 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…