Movie News

ఒక్క హుక్ స్టెప్ లెక్కలు మార్చేసింది

రెగ్యులర్ గా ప్రమోషనల్ కంటెంట్ వస్తున్నా మన శంకరవరప్రసాద్ గారు నుంచి ఇంకేదో మిస్సవుతుందనే ఫీలింగ్ లో ఉన్న అభిమానులకు నిన్న రాత్రి పెద్ద గిఫ్టే దక్కింది. హుక్ స్టెప్ అంటూ డాన్స్ మాస్టర్ ఆట సందీప్ కంపోజ్ చేసిన రిథమ్ కు మెగాస్టార్ ఆడుతుంటే దాని తాలూకు వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతున్నాయి.

మీసాల పిల్ల వంద మిలియన్ల వ్యూస్ దాటేసి ఉండొచ్చు. మెగా విక్టరీ సాంగ్ లో చిరు వెంకీ పోటీ పడి ఉండొచ్చు. శశిరేఖా ప్రసాదూ జనాలకు కనెక్ట్ అవ్వొచ్చు. కానీ వాటిని మించిన డబుల్ ట్రిపుల్ ఇంపాక్ట్ ఇప్పుడీ హుక్ స్టెప్ ఇచ్చిందనేది వాస్తవం.

రాత్రి నుంచి ఇన్స్ టా, ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ తమ ఆనందాన్ని తెగ పంచుకున్నారు. ఇది కదా మాకు కావాల్సిన బాస్ అంటూ మెసేజుల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి 70 ఏళ్ళ వయసులో ఒక మనిషి ఆరోగ్యంగా నడవడమే గొప్ప వరం. అలాంటిది ఫ్యాన్స్ కోసం ఇంత కష్టపడి డాన్సు చేయడం ఒక్క చిరుకే చెల్లింది.

తనకు మాత్రమే సొంతమైన గ్రేస్ ని సింపుల్ గా అనిపించే బాడీ మూమెంట్స్ తో వావ్ అనిపించడం చిరంజీవికి సొంతమైన గొప్ప విద్య. ఇప్పుడీ పాట ప్రభావం వల్ల ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. ట్రైలర్ వల్ల జరగాల్సింది ఏదైనా బాలన్స్ ఉంటే ఇప్పుడీ హుక్ సాంగ్ తో పూర్తయిపోయింది.

దీంతో న్యూట్రల్ ఫ్యాన్స్ లో కూడా మన శంకరవరప్రసాద్ మీద హై వచ్చిందనేది వాస్తవం. ఓపెనింగ్స్ మీద ఇది ప్రభావం చూపిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. గ్రౌండ్ లెవెల్ లో ఫ్యామిలీస్ లో ఆల్రెడీ ఆసక్తి కలిగించడంలో సక్సెస్ అయిన అనిల్ రావిపూడి పాటల రూపంలో దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు.

భీమ్స్ సంగీతం మరీ అత్యద్భుతంగా ఉండకపోవచ్చు. కానీ అనిల్ చిరంజీవి గ్రెస్ ని వాడుకుని తన పిక్చరైజేషన్ తో వాటిని ఇంకాస్త పైకి వెళ్లేలా చేశారు. ఇక మాట్లాడాల్సింది అసలు కంటెంటే. అది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే సంక్రాంతికి వస్తున్నాంని ఈజీగా దాటేయొచ్చు.

This post was last modified on January 8, 2026 2:00 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chiranjeevi

Recent Posts

కోర్టు కటాక్షం… జన నాయకుడికి మోక్షం

ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…

29 minutes ago

ఇంట్లో బంగారం… తీరులో భయంకరం

వెండితెరకు చాలా గ్యాప్ తీసుకున్న సమంత త్వరలో మా ఇంటి బంగారంతో కంబ్యాక్ అవుతోంది. జీవిత భాగస్వామి రాజ్ నిడిమోరు…

1 hour ago

రాజా సాబ్ రాకతో థియేటర్లు కళకళా

ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…

2 hours ago

కేసీఆర్‌కు భారీ ప్రాధాన్యం… రేవంత్ రెడ్డి వ్యూహ‌మేంటి?

ఏ రాష్ట్రంలో అయినా... ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కు ప్ర‌భుత్వాలు పెద్ద‌గా ఇంపార్టెన్స్ ఇవ్వ‌వు. స‌హ‌జంగా రాజ‌కీయ వైరాన్ని కొన‌సాగిస్తాయి. ఏపీ స‌హా…

2 hours ago

అమ‌రావతిపై మళ్లీ రచ్చ మొదలెట్టిన జగన్

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీల‌కు…

3 hours ago

పిఠాపురానికి ముంద‌స్తు సంక్రాంతి!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి…

6 hours ago