కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజైనపుడు ఫ్లాప్ అవుతుంటాయి. కానీ టీవీల్లో, ఓటీటీల్లో వాటికి మంచి స్పందన వస్తుంటుంది. కాల క్రమంలో అవి కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. ఈ జాబితాలో బోలెడన్ని సినిమాలను చెప్పుకోవచ్చు. ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని ఈ కేటగిరీలోకి చేర్చలేం కానీ.. దాని కథ వేరు. అదేమీ ఫ్లాప్ మూవీ కాదు. కానీ సినిమాలో ఉన్న కంటెంట్‌కు ఇంకా బాగా ఆడాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. అనిల్ రావిపూడి కెరీర్లోనే బెస్ట్ ఫిలిం అనదగ్గ ఈ చిత్రానికి.. తన మిగతా సినిమాల స్థాయి బాక్సాఫీస్ రిజల్ట్ అయితే రాలేదు.
కానీ అనూహ్యంగా సినిమా రిలీజైన రెండేళ్లకు పైగా విరామం తర్వాత ఆ సినిమాను అందరూ కొనియాడుతున్నారు సోషల్ మీడియాలో. ఈ చిత్రాన్ని తమిళంలో ‘జననాయగన్’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ చూశాక.. ఒరిజినల్‌తో పోల్చి చూసి బాలయ్య ఇంటెన్సిటీని విజయ్ మ్యాచ్ చేయలేకపోయాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘జననాయగన్’ కారణంగా గత కొన్ని రోజులుగా ‘భగవంత్ కేసరి’ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా సీన్లు, డైలాగులు వైరల్ అవుతుండడంతో.. బాలయ్య ఫ్యాన్స్ మళ్లీ ‘భగవంత్ కేసరి’పై ఒక లుక్కేస్తున్నారు కూడా.
విశేషం ఏంటంటే.. ఈ సంక్రాంతికి రిలీజవుతున్న నాలుగు చిత్రాలతో ‘భగవంత్ కేసరి’కి కనెక్షన్ ఉంది. ‘భగవంత్ కేసరి’ దర్శకుడు అనిల్ రావిపూడి కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఈ పండక్కే ‘జననాయగన్’తో పోటీ పడుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో ‘భగవంత్ కేసరి’ గురించి మాట్లాడుతున్నాడు అనిల్. ‘భగవంత్ కేసరి’ ప్రొడ్యూసర్ సాహు గారపాటినే చిరు-అనిల్ సినిమాను ప్రొడ్యూస్ చేయడం మరో విశేషం.
ఇక ‘భగవంత్ కేసరి’లో విజ్జిగా కీలక పాత్ర చేసిన శ్రీలీల.. తమిళంలో ‘జననాయగన్’కు పోటీగా వస్తున్న ‘పరాశక్తి’లో హీరోయిన్ పాత్ర చేసింది. ఆమె కూడా తను ప్రమోషన్లలో ‘జననాయగన్’తో పాటు ‘భగవంత్ కేసరి’ గురించి మాట్లాడుతోంది. ఇక మరో సంక్రాంతి మూవీ ‘రాజాసాబ్’కు సంగీతం అందించింది ‘భగవంత్ కేసరి’ మ్యూజిక్ డైరెక్టర్ తమనే కావడం మరో విశేషం.
This post was last modified on January 7, 2026 3:20 pm
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ జిఓ త్వరగా వచ్చేయడంతో 1000 రూపాయల ఫ్లాట్ రేట్…
సినిమాల ప్రమోషన్స్ అంటే ఒకప్పుడు యాంకర్లతో ప్రశ్నలు అడిగించడం లేదా స్టేజ్ మీద హడావిడి చేయడం మాత్రమే ఉండేవి. కానీ…
సభకు రాలేదు.. కానీ సంతకాలు మాత్రం ఉన్నాయి.. అదెలా..? ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల తీరు ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.…
కెజిఎఫ్ తర్వాత పెద్ద గ్యాప్ తీసుకున్న శాండల్ వుడ్ స్టార్ యష్ మార్చి 19న టాక్సిక్ తో ప్రేక్షకుల ముందుకు…
14 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ స్టేడియంలో బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. కేవలం ఒక ప్రామిసింగ్ ప్లేయర్ లా కాకుండా,…
సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారు నుంచి ఇటీవల రిలీజ్ చేసిన…