Movie News

ఏజెంట్ నిర్మాతకు అఖిల్ నెక్స్ట్ కండీషన్

ఏజెంట్ సినిమా మిగిల్చిన చేదు అనుభవం నుంచి అఖిల్ చాలా పెద్ద గుణపాఠమే నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్ గా నిర్మాత అనిల్ సుంకర ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అఖిల్ తన దగ్గరికి వచ్చి మరో సినిమా చేద్దామని హామీ ఇస్తూనే, ఒక బలమైన కండీషన్ పెట్టారని అనిల్ బయటపెట్టారు. అదేంటంటే.. దయచేసి నాకు భారీ బడ్జెట్ కథలు గానీ, పెద్ద పెద్ద ప్రాజెక్టులు గానీ తీసుకురావద్దు అని అఖిల్ ఖరాఖండిగా చెప్పేశారట.

మనం చేయబోయే సినిమా చాలా సేఫ్ గా ఉండాలి, బడ్జెట్ లిమిట్స్ లో ఉండాలి అని అఖిల్ కోరుకుంటున్నారట. భారీ హంగుల కోసం పోయి మళ్ళీ రిస్క్ చేయడం ఆయనకు ఇష్టం లేదట. నిర్మాత అనిల్ సుంకర ఏజెంట్ వల్ల ఆర్థికంగా నష్టపోయారు కాబట్టి, ఈసారి చేసే సినిమా కచ్చితంగా ఆయన్ను సేఫ్ జోన్ లోకి తెచ్చేలా ఉండాలని అఖిల్ భావిస్తున్నారు. అందుకే తన మార్కెట్ కు మించిన బడ్జెట్ జోలికి వెళ్లకూడదని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నట్లు నిర్మాత మాటలను బట్టి స్పష్టమవుతోంది.

నిజానికి ఏజెంట్ సినిమా కోసం అఖిల్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. మూడేళ్ల పాటు ఆ సినిమా కోసమే పనిచేశారు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్రాణం పెట్టారు. నిర్మాత కూడా బడ్జెట్ విషయంలో వెనకాడలేదు. కానీ ఫలితం మాత్రం తలకిందులైంది. ఆ దెబ్బకు అఖిల్ కెరీర్ లో లాంగ్ గ్యాప్ రావడమే కాకుండా, నిర్మాతలు కూడా ఇబ్బంది పడ్డారు. ఆ గిల్ట్ అఖిల్ లో ఇంకా ఉన్నట్లుంది. అందుకే ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చేలా ఒక కమర్షియల్ హిట్ ఇవ్వాలని తపిస్తున్నారు.

పెద్ద కథలు పంపొద్దు, చిన్నగా చేద్దాం, అందరం బయటపడదాం అని ఒక హీరో నిర్మాతతో చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఈ నిర్ణయం వల్ల సినిమా మీద బడ్జెట్ భారం తగ్గుతుంది. రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ వస్తే చాలు బ్రేక్ ఈవెన్ సులభంగా అయిపోతుంది. ప్రస్తుతం అఖిల్ చేస్తున్న ‘లెనిన్’ సినిమా కూడా ఇదే కోవలోకి వస్తుంది. మాస్ అండ్ రగ్గడ్ లుక్ లో చిత్తూరు యాసతో చేస్తున్న ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తో కాకుండా, కథకు తగ్గట్టుగా పక్కా ప్లానింగ్ తో తీస్తున్నారు. నాగవంశీ సితార, నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది.

This post was last modified on January 7, 2026 8:25 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సంక్రాంతి హిట్… ఇంతలోనే

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…

2 hours ago

ఏప్రిల్… బాబుకి బలమైన సెంటిమెంట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…

3 hours ago

‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఏదో ఆశిస్తే..

గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…

4 hours ago

జనసేనకు అన్యాయం జరుగుతోందన్న బొలిశెట్టి

2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…

5 hours ago

‘కన్నె పెట్టపై’ సంగీత దర్శకుడు ఫైర్

తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…

5 hours ago

నేషనల్ అవార్డులకు ఇవి కౌంటరా?

జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…

6 hours ago