ఈ మధ్య స్టార్ హీరోల పారితోషకాలు బాగా పెంచేయడం.. అందుకు తగ్గట్లే సినిమాల బడ్జెట్లు పెరిగిపోవడం.. తీరా చూస్తే బిజినెస్, కలెక్షన్లు అనుకున్నంత మేర ఉండక నిర్మాతలు భారీగా నష్టపోతుండడం మీద పెద్ద చర్చ జరుగుతోంది. డిజిటల్ మార్కెట్ పడిపోయినా.. హీరోలు పారితోషకాలు తగ్గించకపోవడంతో నిర్మాతలు మునిగిపోతున్నారనే వాదన వినిపిస్తోంది.
సినిమాల సక్సెస్ రేట్ పడిపోవడం.. థియేటర్లలో ఫుట్‌ఫాల్స్ తగ్గడం.. పైరసీ పెరిగిపోవడం.. ఇలా ఏ టాపిక్ చర్చకు వచ్చినా హీరోల పారితోషకం మీదికి చర్చ మళ్లుతోంది. ఐతే పారితోషకాల విషయంలో నిర్మాతలు మాత్రం హీరోలను వెనకేసుకునే వస్తుంటారు. ఈ టాపిక్ మీద టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్లలో ఒకడైన బన్నీ వాసు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. హీరోలకు భారీ పారితోషకాలు ఇవ్వడంలో తప్పేమీ లేదంటూ ఆయన ఒక వివరణ ఇచ్చారు.
కొన్నేళ్ల పాటు కష్టపడి చేసే ఒక భారీ చిత్రం కోసం ఒక పెద్ద హీరో రూ.200 కోట్లు తీసుకున్నా తప్పేమీ లేదని.. దాని తాలూకు పూర్తి లెక్కలు తెలిస్తే అది అన్యాయం అనిపించదని బన్నీ వాసు అన్నాడు. అలాంటి భారీ చిత్రాల కోసం మూణ్నాలుగేళ్ల పాటు వాళ్లు శ్రమిస్తారని చెప్పాడు. ఆ లెక్కన సంవత్సరానికి రూ.50 కోట్లు తీసుకున్నట్లు అవుతుందన్నాడు. అందులో 40 శాతం ఫ్లాట్ ట్యాక్స్ కడతారని.. అంటే వాళ్లకు మిగిలేది ఏడాదికి రూ.30 కోట్లని చెప్పాడు.
ప్రస్తుతం స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరోకైనా ఏడాదికి ఐదారు కోట్లకు తక్కువగా మెయింటైన్స్ ఉండదన్న బన్నీ వాసు.. టాప్ లెవెల్లో ఉన్న హీరోలకు రూ.20 కోట్ల దాకా ఖర్చవుతుందన్నాడు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ కోసం పేరున్న ప్రొఫెషనల్ ట్రైనర్లను పెట్టుకుంటున్నారని.. వాళ్లకు నెలకు రూ.15 లక్షల దాకా జీతం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు బన్నీ వాసు.
ఇలాంటి ఖర్చులు మరెన్నో ఉంటాయని.. కాబట్టి నెలకు కోటి అంతకంటే ఎక్కువే మెయింటైనెన్స్ అవుతుందని బన్నీ వాసు చెప్పాడు. ఈ లెక్కలు వినడానికి అతిశయోక్తి అనిపించొచ్చని, తనను కామెంట్లలో తిట్టొచ్చని.. కానీ హీరోల తాలూకు ఖర్చులు, ఇబ్బందులు అన్నీ తెలిసిన వాడిగా వాళ్లు భారీ పారితోషకాలు తీసుకోవడంలో తప్పేమీ లేదనే అంటానని బన్నీ వాసు స్పష్టం చేశాడు. సినిమాలు పోయినపుడు హీరోలు పారితోషకంలో కొంత వెనక్కి ఇస్తారనే విషయాన్ని కూడా అతను గుర్తు చేశాడు.
This post was last modified on January 6, 2026 9:45 pm
బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.…
గత కొన్నేళ్లలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ సర్ప్రైజింగ్, సెలబ్రేటెడ్ వెడ్డింగ్స్‌లో కీర్తి సురేష్‌ది ఒకటని చెప్పాలి. కెరీర్ మంచి…
అందరూ మర్చిపోయి ఎప్పుడో ఆలస్యంగా వస్తుందిలే అని భావిస్తున్న కల్కి 2 పేరు హఠాత్తుగా తెరమీదకు రావడంతో ఒక్కసారిగా ప్రభాస్…
ఇంకా అధికారికంగా ప్రకటించడం, ప్రమోషన్లు చేయడం లాంటివి జరగకపోయినా రేపటి నుంచి దురంధర్ ఓటిటి స్ట్రీమింగ్ జరగడం దాదాపు ఖాయమే.…
థియేటర్లలో విడుదలైన పధ్నాలుగు రోజులకే కార్తీ కొత్త సినిమా వా వతియార్ ఓటిటిలో వచ్చేయడం అభిమానులకు షాక్ కలిగించింది. తెలుగు…
రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ సినిమా మామూలుగా ఉండదని చెబుతూ, ప్రభాస్ అభిమానులకు భరోసానిస్తూ, తేడా…