నవీన్ పొలిశెట్టి చాలా ఏళ్ల ముందు మొదలుపెట్టిన సినిమా ‘అనగనగా ఒక రాజు’. అతను ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ కంటే ముందే ఈ సినిమాను అనౌన్స్ చేశాడు. అప్పటికి ‘మ్యాడ్’ దర్శకుడు కళ్యాణ్ శంకర్‌ను ఈ చిత్రానికి దర్శకుడిగా అనుకున్నారు. కానీ ఏవో కారణాలతో ఆ సినిమాకు బ్రేక్ పడింది. తర్వాత ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చేసి హిట్టు కొట్టాడు. ‘అనగనగా ఒక రాజు’ ఇక ముందుకు కదలదని, నవీన్ వేరే సినిమ ా చేస్తాడనే అంతా అనుకున్నారు.
కానీ అందరికీ షాకిస్తూ ఈ సినిమాను మళ్లీ ముందుకు కదిలించాడు. ఈసారి మారి అనే కొత్త వ్యక్తి దర్శకుడి పాత్రలోకి రంగప్రవేశం చేశాడు. ఈ సినిమా కొన్ని నెలల ముందే పూర్తయింది. ఈ సంక్రాంతికి ప్రేక్షకులముందుకు రాబోతోంది. ఎప్పట్లాగే తనదైన శైలిలో ప్రమోషన్లు చేస్తూ సినిమాను ఆడియన్స్‌కు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నాడు నవీన్. సంక్రాంతి చిత్రాల్లో దీనంత ప్రమోషన్లు మరే సినిమాకూ లేకపోవడం విశేషం. నవీన్ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు.
ఐతే ‘అనగనగా ఒక రాజు’ ప్రమోషన్లలో ఎక్కడా దర్శకుడు మారి కనిపించడం లేదు. అంతే కాక నవీన్ దర్శకుడి ప్రస్తావన కూడా తేవట్లేదు. మరోవైపు నిర్మాత నాగవంశీ ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలిస్తుండగా.. అతనూ దర్శకుడి ప్రస్తావన తేవట్లేదు. ఈ సినిమాకు సంబంధించి మొత్తం క్రెడిట్ నవీన్‌కే ఇస్తున్నాడు. నవీన్ సొంతంగా రైటింగ్ టీంను పెట్టుకుని అదిరిపోయే లెవెల్లో స్క్రిప్టు రెడీ చేశాడని.. సినిమాలో కామెడీ సీన్లు ఇరగదీశాడని.. క్లైమాక్స్ కూడా చాలా బాగా చేశాడని అంటున్నాడు. అంతే తప్ప దర్శకుడి గురించి మాట్లాడట్లేదు.
ఈ సినిమాకు నవీన్ ఘోస్ట్ డైరెక్షన్ చేశాడనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పేరుకు ఒక దర్శకుడిని పెట్టుకుని అంతా నవీనే నడిపించాడని.. అందుకే డైరెక్టర్ బయటికి రావట్లేదని.. తన గురించి హీరో, నిర్మాత కూడా ఎక్కడా మాట్లాడట్లేదని అంటున్నారు. మరి ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో అయినా దర్శకుడు కనిపిస్తాడా.. సినిమా గురించి మాట్లాడతాడా.. తనకు టీం క్రెడిట్ ఇస్తుందా.. అన్నది చూడాలి.
This post was last modified on January 6, 2026 8:08 am
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…