రాజా సాబ్ విడుదలకు ఇంకో మూడు రోజులు మాత్రమే ఉంది. జనవరి 8 రాత్రి వేసే ప్రీమియర్ల అప్డేట్స్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ వైపు నుంచి అనుమతులు చివరి నిమిషం దాకా ఎక్కడ ఒత్తిడి పెడతాయోననే టెన్షన్ ఫ్యాన్స్ లో విపరీతంగా ఉంది.
సినిమాటోగ్రఫీ మంత్రికి లేఖ రాసి అందులో ప్రీమియర్లకు గాను మల్టీప్లెక్సు వెయ్యి రూపాయలు, సింగల్ స్క్రీన్ ఎనిమిది వందలు ఫ్లాట్ రేట్ పెట్టమని కోరినట్టుగా ఉన్న లెటర్ బయటికి వచ్చింది. ఇక రెగ్యులర్ షోలకు సైతం పెంపును అభ్యర్థిస్తూ దానికి గల కారణాలు సవివరంగా అందులో పొందుపరిచి ఉన్నాయి.
ఏపీలో సమస్య లేదు. ఓజి, అఖండ 2కే కాదు కూలి, కాంతార చాప్టర్ 1 లాంటి డబ్బింగ్ సినిమాలకు ఇచ్చారు కాబట్టి రాజా సాబ్ కి లేట్ చేయడం ఉండదు. కాకపోతే నైజాంలో బెనిఫిట్ షోలు పడతాయా లేదా అనేది కీలకం. ఎవరో ఒకరు కోర్టు కేసులు వేయడం, దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి రావడం ఇదంతా ప్రతిసారి ఒక తతంగంలా అయిపోయింది.
ఈసారి సాంకేతికంగా అలాంటి ఇబ్బందులు రాకుండా ఏం చేయొచ్చనే దాని గురించి మంత్రి బృందంలోని అధికారులు కసరత్తు చేస్తున్నారట. ఒకవేళ అడిగినంత హైక్ ఇవ్వకపోతే ఏం చేస్తారనే సస్పెన్స్ మూవీ లవర్స్ ని విపరీతంగా నలిపేస్తోంది.
ఇప్పటికైతే రాజా సాబ్ నుంచి అన్ని ప్రమోషన్లు పూర్తయిపోయాయి. ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ ఆడిపాడిన సాంగ్ ఏకంగా వీడియో రూపంలో వచ్చేసింది. కోరుకున్న దానికన్నా చాలా ఎక్కువ కంటెంట్ ఇచ్చేశారు కాబట్టి ఇక బిగ్ స్క్రీన్ పై ప్రభాస్ చేయబోయే రాంపేజ్ చూసేందుకు ప్రేక్షకులు రెడీ అవ్వాలి.
సంక్రాంతికి అందరికంటే ముందు వస్తున్న నేపథ్యంలో టాక్ చాలా కీలకం కానుంది. ఓపెనింగ్స్ అదిరిపోతాయి కానీ టాక్ నిలవడం చాలా ముఖ్యం. బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా ఆందోళన ఉండదు. అదే జరగాలని అభిమానులు దేవుళ్ళకు దండాలు పెట్టేసుకుంటున్నారు.
This post was last modified on January 5, 2026 10:52 pm
ప్రభాస్ హీరోగా మారుతి రూపొందించిన రాజాసాబ్ డిసెంబరు 5నే రిలీజ్ కావాల్సింది. కానీ సంక్రాంతి సీజన్ అయితే బాగుంటుందని ఈ…
చాలా గ్యాప్ తర్వాత సమంతా ఫుల్ లెన్త్ మూవీతో రాబోతోంది. తనే నిర్మించిన శుభంలో చిన్న క్యామియో చేసినప్పటికీ అది…
ఏపీ కేడర్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత ఇటీవల తరచుగా…
తెలుగులో ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా.. ఎలాంటి పాత్ర అయినా చేయడానికి ముందుండే హీరో విక్టరీ వెంకటేష్. ప్రతి సినిమాలో హీరోయిజమే ఉండాలని..…
భయపడినంతా అయ్యింది. రాజకీయాల్లోకి వెళ్లేముందు చివరి సినిమాగా విజయ్ ప్రకటించుకున్న జన నాయకుడుకి ఇంకా అడ్డంకులు తొలగలేదు. సెన్సార్ సర్టిఫికెట్…
సంక్రాంతి పోటీలో అండర్ డాగ్ ఫీలింగ్ కలిగిస్తున్న సినిమాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి మీద మెల్లగా అంచనాలు పెరిగేలా ప్రమోషనల్…