నిన్న విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్ అభిమానుల వరకు బాగుందనిపించింది కానీ సాధారణ ప్రేక్షకులు మాత్రం ఏదో కొంత మిస్సైన ఫీలింగ్ సోషల్ మీడియాలో చూపించారు. చిరంజీవి కామిక్ టైమింగ్ ని బయటికి తీసినట్టు అనిపించినా కేవలం రెండు మూడు డైలాగులతో సరిపెట్టేసి బ్యాక్ గ్రౌండ్ లో బాస్ బాస్ అంటూ హోరెత్తించడం తప్ప భీమ్స్ చేసింది ఏమి లేదనే కామెంట్స్ ఓపెన్ గానే వినిపిస్తున్నాయి.
పైగా మేకింగ్ క్వాలిటీ మీద కూడా మిశ్రమ స్పందన కనిపిస్తోంది. రెండున్నర నిమిషాల్లో వింటేజ్ చిరంజీవిని పరిచయం చేయాలనే తాపత్రయమే ఎక్కువ బయట పడటం కాదనలేని వాస్తవం.
ఇది చూసాక ప్రధానంగా కలుగుతున్న సందేహం ఒకటే. అసలు కంటెంట్ ని అనిల్ రావిపూడి దాచారేమోనని. ఎందుకంటే మాములుగా ట్రైలర్ ని బట్టే ఆడియన్స్ ఏ సినిమాకైనా ఒక అంచనాకు వచ్చేస్తారు. వాల్తేరు వీరయ్య విషయంలో జరిగింది అదే. దాని కట్ పర్ఫెక్ట్ గా ఉండటం వల్ల ఎలాంటి అంచనాలు పెట్టుకోవాలో ఆడియన్స్ కి ముందే క్లారిటీ వచ్చేసింది.
రాజా సాబ్ కు రెండు టీజర్లు, ఒక ట్రైలర్ తర్వాత మళ్ళీ మూడో టీజర్ సిద్ధం చేయడం వెనుక రీజన్ జనాన్ని ప్రిపేర్ చేయడం కోసమే. కానీ అలాంటి కసరత్తు మన శంకరవరప్రసాద్ గారుకి జరగలేదనేది అభిమానుల మధ్య జరుగుతున్న చర్చ.
ఆన్ లైన్ పక్కనపెడితే గ్రౌండ్ లెవెల్ లో చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోతో పాటు వెంకటేష్ క్యామియో లాంటి ఎలిమెంట్స్ మంచి అంచనాలు సృష్టించి పెట్టాయి. కాకపోతే సంక్రాంతికి వస్తున్నాం తర్వాత సినిమా కావడంతో అంతకు మించి ఆశిస్తున్నారు మూవీ లవర్స్. వాటిని అనిల్ రావిపూడి అందుకోవాల్సిందే.
ఎందుకంటే పోటీలో ఉన్న భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి, అనగనగా ఒక రాజు అన్నీ వినోద ప్రధానంగా తీసిన సినిమాలే. మన శంకరవరప్రసాద్ గారు వాటి కన్నా మెరుగ్గా ఉందనిపించుకుంటేనే రేసులో ఫస్ట్ వస్తుంది. రాజా సాబ్ హారర్ జానర్ అందులోనూ ప్రభాస్ మూవీ కాబట్టి దాని క్యాలికులేషన్ వేరు.
This post was last modified on January 5, 2026 11:40 am
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. అసెంబ్లీని బాయ్…
దర్శకుడు ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమాకు సంబంధించిన అయోమయం ఇంకా తొలగడం లేదు. హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్…
ఇవాళని మినహాయిస్తే జన నాయకుడు విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. ఇంకా సెన్సార్ సమస్యలు తొలగిపోలేదు. అధికారులు…
ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలన విషయం బయటపడింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) విడుదల చేసిన కొత్త…
మూవీ లవర్స్ పాతికేళ్ల క్రితమే కోరుకున్న కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం. కానీ రెండుసార్లు…
ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్లో ఎన్నడూ లేనంత పోటీని చూడబోతున్నాం. తెలుగు నుంచి ఏకంగా అయిదు సినిమాలు రిలీజవుతున్నాయి. వీటికి…