తొలి సినిమా అనేది ప్రతి ఒక్కరికీ ముఖ్యమే కానీ.. దర్శకులకు మరీ ముఖ్యం. ఎందుకంటే తొలి సినిమా ఫెయిలైతే మిగతా వాళ్లకు మళ్లీ అవకాశాలు రావచ్చేమో కానీ.. దర్శకులకు రావడం కష్టం. అందుకే అవకాశం దక్కించుకోవడం కంటే.. దాన్ని సద్వినియోగం చేసుకోవడం అత్యంత కష్టం. ఇందుకోసం ఏళ్లకు ఏళ్లు పని చేసి తమ కష్టాల్ని, ఆశల్ని తొలి సినిమాకు పెట్టుబడిగా పెడతారు.
ఐతే మంచి సంస్థలో అవకాశం దక్కించుకుని, కోరుకున్న ఆర్టిస్టులతో అనుకున్నట్లుగా సినిమా తీసి ఫస్ట్ కాపీ రెడీ చేశాక.. ఆ సినిమా విడుదలకు నెలలు, ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తే ఆ దర్శకుడు పడే వేదన అంతా ఇంతా కాదు. ఇప్పుడు ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సనా పడుతున్న బాధ ఇలాంటిదే. సుకుమార్ శిష్యరికం చేయడం ద్వారా ఆయన్ని, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థను మెప్పించి వారితో తొలి సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడతను. మెగా కుర్రాడు వైష్ణవ్ తేజ్‌ను, కొత్తమ్మాయి కృతి శెట్టిని హీరో హీరోయిన్లు పరిచయం చేస్తూ ‘ఉప్పెన’ సినిమాను రూపొందించాడు బుచ్చిబాబు. ఈ చిత్రం పది నెలల కిందటే ఫస్ట్ కాపీతో రెడీ అయింది. వేసవి ఆరంభంలోనే విడుదల చేద్దామనుకున్నారు. కానీ కరోనా వచ్చి బ్రేకులేసేసింది.
మధ్యలో ఓటీటీ ఆఫర్లు వచ్చినా సినిమాను ఇవ్వలేదు. అందుక్కారణం మెగా ఫ్యామిలీ నుంచి ఓ హీరోను ఓటీటీ రూట్లో అరంగేట్రం చేయించడం అంటే కుదరని పని. ఫస్ట్ కాపీ రెడీ చేశాక.. కరోనా ఎప్పుడు వెసులుబాటు ఇస్తుందా అని బుచ్చిబాబు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఖాళీ సమయంలో ఈ సినిమాకు పలుమార్లు ఎడిటింగ్ చేయించారట బుచ్చిబాబుతో. సినీ ప్రముఖులు కొందరికి ప్రివ్యూలు వేయడం, వాళ్లు మార్పులు చేర్పులు చెప్పడం.. ఆ మేరకు కరెక్షన్లు చేయడం కూడా జరిగిందట. త్వరలో విడుదల అంటే కరెక్షన్లుండవు కానీ.. రిలీజ్‌పై అయోమయం ఉండటంతో నిర్మాతలు బుచ్చిబాబుతో వర్క్ చేయిస్తూనే ఉన్నారట. ఇలా మెరుగులు దిద్ది దిద్ది అలసిపోయాడట ఈ యువ దర్శకుడు.
థియేటర్లయితే తెరుచుకున్నాయి కానీ ‘ఉప్పెన’ రిలీజ్ ఊసే లేదు. ఈ మధ్య సంక్రాంతికి రిలీజ్ చేద్దామన్న ఉద్దేశంతో మరోసారి ఎడిటింగ్ చేయించారట బుచ్చిబాబుతో. కానీ ఆ సీజన్లో కూడా సినిమా రిలీజయ్యే సంకేతాలేమీ లేవు. ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక ఏడాదికి కూడా సినిమా రిలీజయ్యేలా కనిపించడం లేదు. ఎన్నో ఏళ్లు కష్టపడి సినిమా తీస్తే.. ఈ అనిశ్చితి ఏంటో అని బుచ్చిబాబు సతమతం అయిపోతున్నట్లు సమాచారం. అనుకున్న ప్రకారం సినిమా రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుని ఉంటే ఈపాటికి రెండో సినిమా కూడా తీసేసేశాడేమో పాపం.
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…