చాలా ఏళ్ల నుంచి ఆది సాయికుమార్ పేరుతో ఒక హీరో టాలీవుడ్లో ఉన్నాడనే విషయాన్నే మరిచిపోయారు థియేటర్లకు వెళ్లే తెలుగు ప్రేక్షకులు. ప్రేమ కావాలి, లవ్లీ చిత్రాలతో ప్రామిసింగ్‌గా మొదలైన అతడి కెరీర్.. తర్వాత గాడి తప్పింది. వరుస ఫ్లాపుల దెబ్బకు మార్కెట్ జీరో అయిపోయి.. తన సినిమాలు థియేటర్లలో రిలీజవడమే గగనం అయిపోయింది. కేవలం ఓటీటీల్లో మాత్రమే తన సినిమాలకు ఆదరణ దక్కేది.
అలాంటి హీరో నుంచి వచ్చిన ‘శంబాల’ సినిమా.. క్రిస్మస్ వీకెండ్లో రిలీజై ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన తెచ్చుకుంది. దీని ప్రోమోలు చూస్తేనే ఇది విషయం ఉన్న సినిమా అని అర్థమైంది. రిలీజ్ తర్వాత కంటెంట్‌తో మెప్పించిన ‘శంబాల’.. క్రిస్మస్ వీకెండ్లో తీవ్రమైన పోటీని తట్టుకుని బాక్సాఫీస్ విజేతగా నిలిచింది. రూ.20 కోట్లకు చేరువగా ఉన్నాయి ఈ సినిమా వసూళ్లు.
శంబాల విజయం ఆదితో పాటు సాయికుమార్ కుటుంబం మొత్తాన్ని ఎంతగా సంతోషంలో ముంచెత్తుతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల సక్సెస్ మీట్లో సాయికుమార్‌తో పాటు ఆయన సోదరులు కూడా అమితానందంతో కనిపించారు.
ఇప్పుడు ఆ కుటుంబం ఆనందాన్ని రెట్టింపు చేసే పరిణామం జరిగింది. ఆది రెండోసారి తండ్రి అయ్యాడు. అతడి భార్య పండంటి మగబడ్డకు జన్మనిచ్చింది. ఆది దంపతులకు ఇప్పటికే ఒక పాప ఉంది. తన పేరు అయానా.
తనకు బాబు పుట్టిన విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి తన ఆనందాన్ని పంచుకున్నాడు ఆది. ఓవైపు సినిమా సూపర్ హిట్టు.. ఇంకోవైపు కొడుకు జననంతో ఆదికి సంబరాలకు అంతేలేదంటూ తన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో అందరి వాడిగా గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్ విషయంలో అందరూ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.
This post was last modified on January 3, 2026 8:26 pm
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించుకునే కానుకల హుండీ పరకామణిలో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. 2021-22 మధ్య కాలంలో రవికుమార్…
వైసీపీ అధినేత జగన్‌పై విమర్శల జోరు పెంచాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఎలా ఉన్నా, గత…
‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్-2’ సినిమాలతో యశ్ అనే మిడ్ రేంజ్ కన్నడ హీరో.. పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్లలో ఒకడిగా…
విజయ్ దేవరకొండ కెరీర్లో చెప్పుకోదగ్గ ఫ్లాపుల్లో డియర్ కామ్రేడ్ ఒకటి. కాన్సెప్ట్ బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్ లోపాల వల్ల ఆడియన్స్…
కలెక్టర్లపై ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ రెడ్డి కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.…
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఈ నెల 9వ…