సంక్రాంతి థియేటర్ల పంచాయితీ సోషల్ మీడియాలో మొదలైపోయింది. జనవరి 9 విడుదలవుతున్న రాజా సాబ్ మీద ఏ స్థాయిలో బజ్ ఉందో చెప్పనక్కర్లేదు. అయితే అదే రోజు వస్తున్న డబ్బింగ్ మూవీ జన నాయకుడుకి అవసరమైనన్ని స్క్రీన్లు ఇవ్వడం పట్ల ప్రభాస్ అభిమానులు ఎక్స్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ కూకట్ పల్లి ఏరియాలో ఒక్క సింగల్ స్క్రీన్ లేకపోవడం పట్ల కోపంగా ఉన్నారు. ఇంకా పూర్తి స్థాయి కేటాయింపులు జరగనప్పటికీ ఫస్ట్ లిస్టుని బట్టి చూస్తే వాళ్ళ ధర్మాగ్రహం సబబుగానే అనిపిస్తోంది. నిజానికి జన నాయకుడుకి మన దగ్గర హైప్ లేదు.
పివిఆర్ ఐనాక్స్ డిస్ట్రిబ్యూషన్ తో జన నాయకుడు విడుదలవుతోంది. దీంతో సహజంగా వాళ్లకున్న మల్టీప్లెక్సులు అన్నింటిలోనూ తమిళ, తెలుగు వెర్షన్లు వేస్తున్నారు. వీటిని తగ్గించి రాజా సాబ్ కు ప్రాధాన్యం ఇవ్వాలని డార్లింగ్ ఫ్యాన్స్ డిమాండ్. ఎందుకంటే తమిళనాడులో రాజా సాబ్ కు మొక్కుబడిగా థియేటర్లు ఇస్తున్నప్పుడు ఏపీ తెలంగాణలో మాత్రం విజయ్ మూవీకి ఎందుకు ఇన్నేసని లాజిక్ తీస్తున్నారు.
జన నాయకుడు పంపిణితో ఏ మాత్రం సంబంధం లేని ఒక అగ్ర నిర్మాతని ఈ టాపిక్ లోకి తీసుకొచ్చి ట్రోలింగ్ చేయడం ఎక్స్ లో కనిపిస్తోంది. నిజానికాయన తీసుకున్నది వేరే సినిమాలు.
నిజానికి ఈ సమస్య ఇప్పటిది కాదు. ఏళ్ళ తరబడి నలుగుతున్నదే. ప్రతిసారి తమిళ డబ్బింగ్ హక్కులు ఎవరో ఒకరు కొనడం, వాటిని ఇక్కడ సమాంతరంగా రిలీజ్ చేసి మన సినిమాల మీద ప్రభావం చూపించడం మామూలైపోయింది. ప్రతిసారి దీని గురించి మూవీ లవర్స్ గళమెత్తుతున్నారు కానీ సమాధానం దొరకడం లేదు.
ఇప్పుడే ఇలా ఉంటే జనవరి 12 నుంచి థియేటర్ల సమస్య తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండబోతోంది. పరిస్థితి ఇలా ఉంటుందని తెలిసే పరాశక్తి తెలుగు వెర్షన్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. బహుశా మన దగ్గర లేట్ రిలీజ్ ఉండొచ్చు. అలా జరిగితే మంచి నిర్ణయమే.
This post was last modified on January 3, 2026 2:58 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వకముందే పెద్ద దుమారం రేగింది. కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు నుంచి బంగ్లాదేశ్…
త్రివిక్రమ్ శ్రీనివాస్ గొప్ప రచయిత, దర్శకుడు అనే సంగతి అందరికీ తెలుసు. కానీ ఆయన సతీమణి సాయి సౌజన్య ప్రతిభ…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విషమ పరీక్షగా మారారా? ట్రంప్ దూకుడు కారణంగా…
గత కొన్నేళ్లుగా స్టార్లు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలు సెన్సార్ విషయంలో రాజీ పడకుండా A సర్టిఫికెట్ తీసుకోవడానికి వెనుకాడని…
తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీపై కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ తీరు, నాయకత్వ వైఖరిపై ఆవేదన వ్యక్తం…
యువతలో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినీ హీరోగా అభిమానాన్ని సంపాదించుకున్న పవన్, అదే స్థాయిలో…