అనూహ్య పరిణామాల మధ్య డిసెంబరు 5న రిలీజ్ ఆగి.. ఇంకో వారం ఆలస్యంగా రిలీజైన నందమూరి బాలకృష్ణ సినిమా అఖండ-2 అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఐతే తొలి వీకెండ్ తర్వాత ఈ సినిమా వసూళ్లు బాగా డ్రాప్ కాగా.. అంతటితో సినిమా పనైపోయిందని అంతా అనుకున్నారు.
కానీ అఖండ-2 బాక్సాఫీస్ పెర్ఫామెన్స్‌ను బ్యాడ్ అని చెప్పలేని విధంగా.. తర్వాతి రెండు వీకెండ్లలో కూడా మంచి వసూళ్లే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్లు మరీ పెద్దవి కావడం వల్ల సినిమాను బాక్సాఫీస్ లెక్కల్లో ఫ్లాప్ అని చెప్పాలి కానీ.. ఈ సినిమా వసూళ్లను తక్కువ చేయలేం. ఇప్పటికీ ఓ మోస్తరు వసూళ్లతో సాగుతోందీ చిత్రం. ఐతే సంక్రాంతి సినిమాల సందడి మొదలయ్యాక అఖండ-2 రన్ పూర్తవుతుందన్నది స్పష్టం.
మరి అఖండ-2 ఓటీటీ విందు ఎప్పుడు ఉంటుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఆ కబురు త్వరలోనే అధికారికంగా వినబోతున్నారు. జనవరి 9 నుంచి ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ స్ట్రీమ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ వీకెండ్లోనూ అఖండకు ఓ మోస్తరుగా వసూళ్లు వస్తున్నాయి. కాబట్టి ఆ తర్వాత డిజిటల్ రిలీజ్ గురించి నెట్‌ఫ్లిక్స్ ప్రకటన చేసే అవకాశముంది.
ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే జనవరి 2నే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి రావాల్సింది. కానీ డిసెంబరు 5 నుంచి 12కు వాయిదా పడ్డ నేపథ్యంలో స్ట్రీమింగ్ డేట్ కూడా వారం వెనక్కి జరిగింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ-2ను 14 రీల్స్ ప్లస్ బేనర్ మీద రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకు బాలయ్య కెరీర్లోనే అత్యధికంగా 200 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఫుల్ రన్లో నైజాం మినహా ఈ సినిమా ఎక్కడా బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
This post was last modified on January 3, 2026 10:01 am
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…