కొందరు పరభాషా కథానాయికలను చూస్తే.. వాళ్లు వేరే భాషకు చెందిన వాళ్లు అనే ఫీలింగే రాదు. చక్కగా తెలుగు నేర్చుకుని, తెలుగులో మాట్లాడ్డమే కాదు.. ఇక్కడి కల్చర్‌కు తగ్గట్లుగా వ్యవహరిస్తుంటారు. అభిమానులు హీరోలు, హీరోయిన్ల విషయంలో చేసే కామెంట్లు, నినాదాల గురించి కూడా తెలుసుకుని.. వాటిని స్టేజ్‌ల మీద, ఇంటర్వ్యూలో ప్రస్తావించి ఆశ్చర్యపరుస్తుంటారు. నిధి అగర్వాల్ ఈ కోవకే చెందుతుంది.
తన మాటతీరు, నడవడిక, కమిట్మెంట్‌తో తాను పని చేస్తున్న స్టార్ హీరోల అభిమానులను ఆమె అమితంగా ఆకట్టుకుంటోంది. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఆలస్యమైనప్పటికీ కొన్నేళ్ల పాటు ఓపిగ్గా ఎదురు చూస్తూ ఆ సినిమా కోసం ఎంతో కష్టపడ్డ నిధి.. రిలీజ్ టైంలో ప్రమోషన్ల కోసం ఎలా కాళ్లరిగేలా తిరిగిందో తెలిసిందే. స్వయంగా పవన్ ఆమెను చూస్తే తనకు సిగ్గుగా ఉందన్నాడు.
ఇక తన కొత్త చిత్రం ‘రాజాసాబ్’ కోసం కూడా అలాగే శ్రమిస్తోంది నిధి. ఒక ఈవెంట్ సందర్భంగా చాలా ఇబ్బంది పడ్డా కూడా ఫ్యాన్స్‌ను పల్లెత్తు మాట అనలేదు. వారి మీద కేసులు పెట్టమంటే వద్దంది. కట్ చేస్తే ఒక ఇంటర్వ్యూలో ఆమె పవన్ కళ్యాణ్, ప్రభాస్‌ల గురించి చేసిన కామెంట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ గురించి అభిమానులు ఏమంటారు అని అడిగితే.. ‘బాబులకే బాబు కళ్యాణ్ బాబు’ అంటూ ఫ్యాన్స్ ఈవెంట్లలో వల్లెవేసే మాటను చెప్పింది నిధి.
మరి ప్రభాస్ గురించి ఏమంటారు అంటే.. ‘‘రాజులకే రాజు ప్రభాస్ రాజు’’ అనే నినాదం గురించి చెప్పింది. మరి మీ గురించి ఫ్యాన్స్ అభిప్రాయం ఏంటి అంటే.. ‘‘పాపలకే పాప నిధి పాప’’ అంటూ నవ్వేసింది నిధి. ఇవన్నీ మీకెలా తెలుసు అని అడిగితే.. సినిమా ఈవెంట్లకు వెళ్తే ఇలాంటి నినాదాలతోనే అభిమానులు హోరెత్తిస్తుంటారని.. అందుకే తనకు అవి కంఠతా వచ్చేశాయని నిధి చెప్పింది. డిజాస్టర్ అయిన ‘హరిహర వీరమల్లు’ సినిమా వల్ల కూడా తనకు మేలే జరిగిందని.. తనకు పెర్ఫామర్‌గా పేరు రావడం సంతోషం కలిగించిందని ఆమె చెప్పడం విశేషం.
This post was last modified on January 2, 2026 10:13 pm
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్…
ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా నుంచి ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలంటే దానికి ఎంత హడావుడి చేస్తారో? అప్డేట్…
సెన్సెక్స్ మాదిరి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్న వైనం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటుంది. ఉదయం ఉన్న ధర…
భారత్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆఫ్ లైన్ లోనే కాదు…
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమమైన, విభిన్నమైన చిత్రాల్లో అరవింద సమేత ఒకటి. అందులో కీలక పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరికీ మంచి…