గడిచిపోయిన ఏడాదిలో టాలీవుడ్ బాగా ఫీలైన లోటు మన ప్యాన్ ఇండియా సినిమాలు ఎలాంటి అద్భుతాలు చేయకపోవడం. ఓజి మూడు వందల కోట్లు దాటినా, అఖండ 2 విపరీతమైన అంచనాలు మోసుకొచ్చినా, వార్ 2 మీద ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నా అవేవి ఇండియా టాప్ 5లోకి వెళ్ళలేదు.
కానీ 2026 దానికి భిన్నంగా బోలెడు ప్రామిసింగ్ మూవీస్, వేల కోట్ల పెట్టుబడులతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రాజా సాబ్ తో దీనికి బోణీ జరగాలని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. మొదటిసారి ప్రభాస్ రేంజ్ హీరో హారర్ జానర్ చేయడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తగ్గట్టే ట్రైలర్ కంటెంట్ నమ్మకాన్నైతే కలిగించింది.
జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) మీద ఎంత హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేసవి విడుదలని ప్రకటించారు కానీ టార్గెట్ చేరుకోవడం కొంత డౌట్ గానే ఉంది. రామ్ చరణ్ పెద్దికి చికిరి చికిరి పుణ్యమాని నేషనల్ వైడ్ బజ్ వచ్చేయడంతో బాలీవుడ్ బయ్యర్ల నుంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి.
న్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ ఏకంగా ఇంటర్నేషనల్ కొలాబరేషన్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ప్రభాస్ – హను రాఘవపూడిల ఫౌజీని ఇదే సంవత్సరం విడుదల చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ఫిక్సయ్యారు. తేదీ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది.
విజువల్ ఎఫెక్ట్స్ కోసం విపరీతమైన జాప్యానికి గురైన చిరంజీవి విశ్వంభర ఆ విషయంలో పూర్తి సంతృప్తి చెందాకే విడుదల తేదీని ప్రకటించుకోనుంది. నిఖిల్ స్వయంభు మేకింగ్ వీడియో చూశాక అందరూ ఆశ్చర్యపోయారు. కాంతార తరహాలో పీరియాడిక్ సెటప్ కనక ప్రేక్షకులకు కనెక్ట్ అయితే కార్తికేయ 2ని మించి విజయం సొంతం చేసుకోవచ్చు.
ప్రభాస్ మరో మూవీ స్పిరిట్ కూడా డిసెంబరనే ప్రచారం జరుగుతోంది కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని ఎన్బికె 111 కూడా ప్యాన్ ఇండియా లెవెలే. ఇవన్నీ చెప్పిన టైంకు చెప్పినట్టు వచ్చేస్తే థియేటర్లు కాసుల గలగలతో కళకళలాడతాయి.
This post was last modified on January 1, 2026 1:05 pm
ఏపీ రాజధాని అమరావతిలో అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు వచ్చేశాయి. ఆర్బీఐ వంటి బ్యాంకింగ్ సంస్థలు…
కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో పెద్ద సూపర్ స్టార్లలో ఒకడిగా అవతరించిన యశ్ నుంచి.. ఆ తర్వాత…
టెక్నాలజీ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఏఐ నిపుణులకు భారీ జీతాలు ఇస్తారని తెలుసు. కానీ ఇప్పుడు అమెరికాలోని కొన్ని ప్రముఖ…
కొత్త శుక్రవారం వచ్చింది. బోలెడు రిలీజులు తెచ్చింది. తమ సినిమాని జనం చూసేందుకు ఏమేం చేయాలో ప్రమోషన్ల పరంగా అన్ని…
అంతర్జాతీయ క్రికెట్లో గత ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే సిరీస్‌తో భారత లెజెండరీ క్రికెటర్ రోహిత్ శర్మ కెప్టెన్సీ…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుతూనే వున్నాయి. తొలుత మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. కూటమి పై చేయి సాధించింది.…