Movie News

ప్రమోషన్లు చేయకపోవడంపై యువ హీరో రెస్సాన్స్

నూతన సంవత్సర కానుకగా రాబోయే గురువారం ‘వనవీర’ అనే సినిమా రిలీజ్ కాబోతోంది. ముందు ‘వానర’ అనే పేరుతో ఉన్న ఈ సినిమాకు ఇటీవల ఏవో ఇబ్బందులు తలెత్తి ‘వనవీర’ అని టైటిల్ మార్చారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిర్వహించిన ప్రెస్ మీట్లో హీరో కమ్ డైరెక్టర్ అవినాష్ తిరువీధుల.. రిలీజ్ ముంగిట టైటిల్ మార్చాల్సి రావడంపై చాలా ఎమోషనల్ అయ్యాడు.

అలాగే ఈ సినిమాలో భాగమైన ఒక నటుడు.. ప్రమోషన్లకు దూరంగా ఉండడం మీదా స్పందించాడు. ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్ అని ఆ నటుడిని సినిమాలో పెట్టుకున్నామని.. కానీ తమ చిత్రం గురించి సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా పెట్టలేదని వాపోయాడు అవినాష్. ఆ నటుడెవరో పేరు చెప్పకపోయినా అది నందు అని అందరికీ అర్థమైపోయింది.

నందు లీడ్ రోల్ చేసిన ‘సైక్ సిద్దార్థ’ కూడా జనవరి 1నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ‘వనవీర’ హీరో, దర్శకుడు అవినాష్ తన మీద పరోక్షంగా చేసిన విమర్శలపై నందు స్పందించాడు. ‘వనవీర’ సినిమా మేకర్స్ తన పేరు ఎత్తకుండా తనను విమర్శించినప్పటికీ.. తనకేమీ బాధ లేదని, ఆ సినిమా మీద తనకు ప్రేమే ఉందని నందు చెప్పాడు.

ఎప్పుడో 36 ఏళ్ల కిందట మోహన్ బాబు హీరోగా నటించిన, విలన్‌గా చేసిన సినిమాలు ఒకే రోజు రిలీజయ్యాయని.. తర్వాత అలాంటి ఘనత సాధించిన నటుడు తానే అని ఒక జర్నలిస్టు మిత్రుడు చెప్పాడని.. ఇలా జరుగుతున్నందుకు తనకు చాలా గర్వంగా ఉందని నందు చెప్పాడు.

ఐతే ‘వానర’ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ గురించి ముందు రోజు సాయంత్రం నిర్మాత కాల్ చేసి చెప్పాడని.. అప్పుడు తాను గుంటూరులో ఉన్నానని.. మరుసటి రోజు 10 గంటలకు తాను ప్రెస్ మీట్‌కు రాలేనని చెబితే, నిర్మాత సరే అన్నాడు తప్ప.. తన కోసం సాయంత్రం వరకు వెయిట్ చేస్తానని కూడా అనలేదని.. తనకు ముెందే సమాచారం ఇచ్చి ఉంటే ఈ ఈవెంట్ కోసం ప్లాన్ చేసుకుని ఉండేవాడనని నందు చెప్పాడు. తన మీద విమర్శలు చేసినప్పటికీ ఆ సినిమా మేకర్స్ మీద తనకేమీ కోపం లేదని.. ఆ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నందు చెప్పాడు. 

This post was last modified on December 29, 2025 10:43 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Nandhu

Recent Posts

2025: జ‌న‌సేన గ్రాఫ్ పెరిగిందా? తగ్గిందా?

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ ఏర్పాటుకు కీల‌క పాత్ర పోషించిన జ‌న‌సేన పార్టీ 2025లో ఏ విధంగా ముందుకు సాగింది? 2024లో…

1 hour ago

రీ రిలీజులకు గ్యాప్ ఇవ్వడం అవసరం

ఈ వారం రెండు రీ రిలీజులు వస్తున్నాయి. ఒకటి మహేష్ బాబు మురారి. రెండు పవన్ కళ్యాణ్ జల్సా. ఇవి…

3 hours ago

టాక్: విజయ్ కు రాజ్యసభ ఎంపీ సీటు?

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చింతకాయ‌ల అయ్య‌న్న పాత్రుడి కుమారుడు.. యువ నేత‌, సీబీఎన్ ఆర్మీ,…

4 hours ago

ఆ ఐటెం సాంగ్ తమన్నా చేసి ఉంటే..?

ఒకప్పుడు వివిధ భాషల్లో అగ్ర కథానాయికగా కొనసాగింది తమన్నా. కానీ కొన్నేళ్లుగా ఆమె ఐటెం సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది.…

4 hours ago

ప్ర‌భాస్- హీరోయిన్… చీర వెనుక క‌థ‌

రాజాసాబ్‌లో ప్ర‌భాస్‌కు జోడీగా ముగ్గురు హీరోయిన్లు న‌టించారు. అందులో రిద్ధి కుమార్‌పై మొన్న అంద‌రి దృష్టీ నిలిచింది. రాజాసాబ్ ప్రి…

5 hours ago

సిద్ధూ నిర్ణయాలు ఎందుకు మారుతున్నాయ్

టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డతో సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీ కోహినూర్. కాన్సెప్ట్…

5 hours ago