Movie News

అల్లు హీరో పెళ్లి డేట్.. ఇలా కూడా అనౌన్స్ చేస్తారా?

టాలీవుడ్లో మరో సెలబ్రెటీ పెళ్లికి రంగం సిద్ధమైంది. అల్లు అరవింద్ కొడుకుల్లో అందరి కంటే చిన్నవాడైన శిరీష్ ఒక ఇంటివాడు కాబోతున్న సంగతి ఇప్పటికే వెల్లడైంది. నయనిక అనే అమ్మాయితో ప్రేమలో పడ్డ శిరీష్.. గత అక్టోబరులో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్‌లో ఘనంగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఐతే ఎంగేజ్మెంట్ అయి మూడు నెలలు కావస్తున్నా ఇంకా పెళ్లి డేట్ అనౌన్స్ చేయలేదు.

మరి వివాహం ఎప్పుడా అని సినీ అభిమానుల్లోనే కాదు.. అల్లు కుటుంబంలోని పిల్లల్లోనూ క్యూరియాసిటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అల్లు బాబీ, అల్లు అర్జున్‌ల పిల్లలు.. తమ బాబాయిని పెళ్లి డేట్ గురించి అడిగారు. బాబాయ్ పెళ్లి ఎప్పుడు అని 2026 మార్చి 6 అని అతను బదులివ్వడం.. సంగీత్ ఎప్పుడు అని అడిగితే, మనం సౌత్ ఇండియన్స్ మనకు అలాంటివి ఉండవు అని చెప్పడం.. ఇలా ఒక ఫన్నీ రీల్‌ చేసి పెళ్లి డేటును అనౌన్స్ చేసింది అల్లు కుటుంబం.

సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన మీమ్ వీడియో టెంప్లేట్లో ఈ రీల్ చేశారు. అది చూసి పెళ్లి డేటును ఇలా కూడా అనౌన్స్ చేస్తారా అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.

నయనికతో తన పరిచయం, ప్రేమ గురించి ఎంగేజ్మెంట్ తర్వాత శిరీష్ ఒక సోషల్ మీడియా పోస్టు పెట్టాడు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లే.. నయనికతో తన ప్రేమకు పునాది అని అందులో శిరీష్ వెల్లడించాడు. వరుణ్, లావణ్యల పెళ్లి తర్వాత యంగ్ హీరో నితిన్, అతడి భార్య షాలిని కలిసి ఒక పార్టీ ఇచ్చారట. ఆ వేడుకకు షాలిని బెస్ట్ ఫ్రెండ్ అయిన నయనిక కూడా వచ్చిందట. తొలిసారి తనను అప్పుడే చూశాడట శిరీష్. నాటి పరిచయం తర్వాత తామిద్దరం ప్రేమలో పడ్డామని.. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నామని శిరీష్ తెలిపాడు.

https://www.instagram.com/reels/DS1WjPXkqlC

This post was last modified on December 29, 2025 1:09 pm

Share

Recent Posts

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

48 minutes ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

55 minutes ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

2 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

5 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

6 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

7 hours ago