Movie News

అఖండ-2 రికార్డులు.. ఇటు ఆనందం, అటు బాధ

నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక అంచనాలతో వచ్చిన సినిమాల్లో ‘అఖండ-2’ ఒకటి. ఎవ్వరూ ఊహించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ అయిన ‘అఖండ’కు సీక్వెల్ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. ఈ నెల 12న డివైడ్ టాక్‌తో మొదలైన ‘అఖండ-2’ వీకెండ్ వరకు మంచి వసూళ్లే రాబట్టినా.. తర్వాత కలెక్షన్లు ఒక్కసారిగా డౌన్ అయ్యాయి.

అంతటితో సినిమా కథ ముగిసిందని అనుకున్నారు. కానీ తర్వాత కూడా తర్వాతి రెండు వీకెండ్లలోనూ సినిమా చెప్పుకోదగ్గ వసూళ్లే రాబట్టింది. సెకండ్ వీకెండ్లో తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ కాకపోవడం దీనికి కలిసొచ్చింది. ఇక ఈ వీకెండ్లో క్రిస్మస్ సెలవులు కలిసొచ్చాయి. దాని వల్ల ఇప్పటికీ సినిమాకు షేర్ తెచ్చుకోగలుగుతోంది.

తొలి వీకెండ్ తర్వాత ‘అఖండ-2’ కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోవడం చూసి ఇది పెద్ద డిజాస్టర్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ తర్వాత మళ్లీ సినిమా పైకి లేచింది. ఎలాగోలా కష్టపడి ఈ సినిమా రూ.120 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టింది. బాలయ్య కెరీర్లో ఇది వరుసగా అయిదో వంద కోట్ల సినిమా కావడం విశేషం.

మరోవైపు ఈ చిత్రం యుఎస్‌లో కూడా అడుగు అడుగు వేసుకుంటూ మిలియన్ మార్కును అందుకుంది. బాలయ్యకు అక్కడ ఇది వరుసగా అయిదో మిలియన్ డాలర్ మూవీ. సీనియర్ హీరోల్లో ఎవ్వరూ ఈ రెండు ఘనతలు సాధించలేదు. ఇది బాలయ్య అభిమానులకు ఆనందాన్నిచ్చే విషయమే కానీ.. ‘అఖండ-2’ బయ్యర్లకు మాత్రం పెద్దగా సంతోషం లేదు.

వరల్డ్ వైడ్ ఎక్కడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. నైజాంలో స్వల్ప నష్టాలతో బయటపడుతున్నారు కానీ.. మిగతా అన్ని చోట్ల నష్టాలు భారీగానే ఉన్నాయి. ఉత్తరాంధ్రలో అయితే టార్గెట్లో సగం కూడా రాబట్టలేకపోయింది. యుఎస్‌లో కూడా అదే పరిస్థితి. రూ.200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే సినిమా రూ.120 కోట్ల రేంజిలో ఉందంటే దీని ఫలితమేంటో వేరే చెప్పాలా?

This post was last modified on December 29, 2025 3:36 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

3 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

5 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

11 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

13 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

14 hours ago