ప్రభాస్ కొత్త సినిమా ‘రాజాసాబ్’ మొదలైనపుడు.. అభిమానుల నుంచి ఎంత వ్యతిరేకత వ్యక్తమైందో తెలిసిందే. మారుతి ఈ సినిమాకు ముందు మిడ్ రేంజ్ సినిమాలే తీశాడు. పైగా పేలవ ఫామ్‌లో ఉన్నాడు. చివరి చిత్రాలు పక్కా కమర్షియల్, మంచి రోజులొచ్చాయి డిజాస్టర్లు అయ్యాయి. దీంతో అభిమానులు ఈ సినిమా వద్దే వద్దూ అంటూ ప్రభాస్‌కు విన్నపాలు చేశారు.
వారిలో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటే.. సినిమా గురించి అధికారిక ప్రకటన చేయడానికి కూడా మేకర్స్ భయపడ్డారు. కానీ ఈ సినిమా ప్రోమోలు చూశాక వారి అభిప్రాయం మారుతూ వచ్చింది. ఫస్ట్ టీజర్ లాంచ్ అయినపుడు మంచి బజ్ వచ్చింది. కానీ ఆ తర్వాత చిత్రంగా మళ్లీ మైప్ తగ్గడం మొదలైంది. చాలా ముందుగా రిలీజ్ చేసిన ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేదు. పాటలు కూడా బానే ఉన్నాయి కానీ అనుకున్న స్థాయిలో లేవు. ప్రమోషన్లు కూడా సరిగా చేయలేదు. సంక్రాంతికి గట్టి పోటీ మధ్య వస్తున్న ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోగలదా అన్న సందేహాలు కలిగాయి.
ఐతే నిన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్లో హీరో ప్రభాస్, దర్శకుడు మారుతి, ఇతర టీం సభ్యుల మాటలు చూస్తే సినిమా ఆషామాషీగా ఉండదు అనే అభిప్రాయం అభిమానుల్లో కలుగుతోంది. ముఖ్యంగా మారుతి చాలా పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు. ఒక్క శాతం కూడా ఎంటర్టైన్మెంట్ తగ్గదని.. సినిమాలో అసలు డిజప్పాయింట్ చేసే సన్నివేశమే ఉండదని.. అలా ఉంటే తన ఇంటికి వచ్చి నిలదీయొచ్చని ఇంటి అడ్రస్ డీటైల్స్ కూడా స్టేజ్ మీద చెప్పేశాడు మారుతి.
సినిమా మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఇలాంటి స్టేట్మెంట్ ఒక దర్శకుడి నుంచి రాదు. పైగా ఇదేమీ చిన్న సినిమా కాదు.. ఇష్టమొచ్చినట్లు స్టేట్మెంట్ ఇవ్వడానికి. అయినా మారుతి ఇలా మాట్లాడాడంటే తనకు సినిమా మీద అంత నమ్మకం ఉన్నట్లే. మరోవైపు తన సినిమాల గురించి గొప్పలు పోని ప్రభాస్ సైతం మారుతికి మంచి ఎలివేషన్ ఇచ్చాడు.
ఈ సినిమా క్లైమాక్స్ గురించి ప్రస్తావిస్తూ.. అది పెన్నుతో రాశావా, గన్నుతో రాశావా అని మారుతిని అడిగాడు. దీంతో పతాక సన్నివేశాలు ఒక రేంజిలో ఉంటాయని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. మిగతా టీం సభ్యులు కూడా సినిమా వేరే లెవెల్లో ఉంటుందనే ధీమాను వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ కాన్ఫిడెన్స్ చూశాక ప్రభాస్ అభిమానుల్లో సినిమా మీద అంచనాలు పెరిగాయి. మరి వాటిని అందుకునేలా సినిమా ఉంటుందా అన్నది ఇంకో పది రోజుల్లో తేలిపోతుంది.
This post was last modified on December 28, 2025 2:32 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…