రాజమౌళి కెరీర్‌ను ‘మగధీర’కు ముందు, ‘మగధీర’కు తర్వాత అని విభజించి చూడాలి. ‘మగధీర’కు ముందు వరకు ఆయన సగటు మాస్ మసాలా సినిమాలే తీస్తూ ఉండేవాడు. కానీ ఈ చిత్రంలో జానపద నేపథ్యం ఉన్న ఒక భారీ కథను విజువల్ ఎఫెక్ట్స్, కళ్లు చెదిరే యాక్షన్ ఘట్టాలతో అద్భుతంగా తీర్చిదిద్ది తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాడు.
ఆ తర్వాత ‘ఈగ’ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌ను ఇంకా గొప్పగా ఉపయోగించుకుని వెండితెరపై మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. కాకపోతే ఈ సినిమాలు తీసే సమయానికి పాన్ ఇండియా ట్రెండు మొదలు కాలేదు. ఆ చిత్రాలు వేరే భాషల వాళ్లకు అంతగా రీచ్ కాలేదు. ‘ఈగ’ సినిమా చూసిన వాళ్లు హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉందని కొనియాడారు.
గ్లోబల్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే సినిమా అని కీర్తించారు. కానీ రీచ్ తక్కువ కావడం వల్ల కమర్షియల్‌గా ఆ చిత్రం దాని రేంజ్ కు తగ్గట్టు ఫలితాన్ని అందుకోలేదని ఇప్పటికీ టాలీవుడ్ అభిమానులు అభిప్రాయాలు తెలుపుతూ ఉంటారు. ఆ రోజుల్లోనే 120 కోటలు పైగా కలెక్షన్లు కొల్లగొట్టినా.. ఈగ స్థాయి సినిమాకు మరింత పోటెన్షియల్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. పాన్ ఇండియా ట్రెండ్ టైమ్ లో వచ్చి ఉంటే ఈగ 500 కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యం లేదని ఇప్పటికీ జక్కన్న ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ ఉంటారు.
ఈ మూవీని ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్‌కు పరిచయం చేయడానికి రాజమౌళి అండ్ టీమ్ రెడీ అవుతుండడం విశేషం. ప్రస్తుతం జక్కన్న తీస్తున్న ‘వారణాసి’ మీద ప్రపంచ స్థాయిలో భారీ అంచనాలే ఉన్నాయి. దీనికంటే ముందు ‘ఆర్ఆర్ఆర్’ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు, ఆదరణ దక్కించుకుంది. ఇటీవల ‘బాహుబలి’ రెండు భాగాలను కలిపి ‘ది ఎపిక్’ పేరుతో రీ రిలీజ్ చేస్తే మంచి స్పందన వచ్చింది.
ఈ కోవలోనే ‘ఈగ’ను కూడా రీ రిలీజ్ చేయబోతోంది రాజమౌళి టీం.
‘వారణాసి’ పేరుతో నడుస్తున్న ట్విట్టర్ హ్యాండిల్లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘బాహుబలి’ తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా రీ ఎడిట్ చేసి, గట్టిగా ప్రమోషన్లు చేసి సినిమాను గ్లోబల్ లెవెల్లో రీ రిలీజ్ చేయబోతున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మరి అప్పుడైనా ‘ఈగ’ సినిమాలో ఉన్న కంటెంట్ కు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా సినిమా మంచి ఫలితాన్నందుకుంటుందేమో చూడాలి.
This post was last modified on December 28, 2025 2:26 pm
ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ లో ఏపీలోని హస్తకళలను గుర్తు చేశారు. నరసాపురం లేస్ క్రాఫ్ట్…
ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ హీరోల్లో మోహన్ లాల్ ఒకడు. మలయాళ ఇండస్ట్రీలో నటన పరంగా, బాక్సాఫీస్ రికార్డుల పరంగా ఆయన్ని…
ప్రభాస్ కొత్త సినిమా ‘రాజాసాబ్’ మొదలైనపుడు.. అభిమానుల నుంచి ఎంత వ్యతిరేకత వ్యక్తమైందో తెలిసిందే. మారుతి ఈ సినిమాకు ముందు…
ప్రభాస్‌తో పని చేసే ప్రతి ఆర్టిస్టూ, టెక్నీషియనూ తన పెద్ద మనసు గురించి చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా కడుపు పగిలేలా…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలకు శాశ్వతంగా సెలవు చెప్పేశాడు. ఇకపై ప్రజాసేవ కోసం రాజకీయాల్లో పూర్తి స్థాయిలో కొనసాగేందుకు…
ఏపీలో జిల్లాల విభజన వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పటివరకు మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ,…