Movie News

దురంధరుడి ఊచకోతకు ‘వెయ్యి కోట్లు’

దురంధర్ అనుకున్నట్టే వెయ్యి కోట్ల మార్కును దాటేసింది. రిలీజ్ కు ముందు వరకు పెద్దగా ఆంచనాలు లేవు. ట్రైలర్ చూశాక ఇదేదో తేడాగా ఉందని నెగటివ్ కామెంట్స్ చేసినవాళ్లు ఎక్కువ. ఓపెనింగ్ రెండు రోజుల కలెక్షన్లు చూసి కార్పొరేట్ బుకింగ్స్ అని ఎద్దేవా చేసిన వాళ్ల సంఖ్య పెద్దదే.

అయినా సరే ఇవన్నీ దాటుకుని దురంధర్ థౌసండ్ క్రోర్ క్లబ్బులోకి గర్వంగా అడుగు పెట్టింది. ఫైనల్ రన్ కు దగ్గరవుతున్నప్పటికీ ఇప్పట్లో థియేటర్ల నుంచి తీసేసే అవసరం ఉండదని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల మెయిన్ సెంటర్స్ లో మూడో వారం కూడా ఆడుతున్న టయర్ 2 హీరో సినిమా దురంధర్ ఒక్కటే.

ఇండియా నుంచే 790 కోట్ల దాకా కలెక్ట్ చేసిన దురంధర్ ఓవర్సీస్ లో మరో 217 కోట్లకు పైగా లాగేసింది. క్రిస్మస్ రోజు ఏకంగా 28 కోట్లకు పైగా వసూలు కావడం ఇంకో సంచలనం. ఇదంతా కేవలం హిందీలో మాత్రమే. యానిమల్, జవాన్ ని లక్ష్యంగా చేసుకుని వాటిని దాటేసిన దురంధర్ ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ గా పుష్ప 2ని పెట్టుకుంది.

దాన్ని ఛేదించడం ఈజీ కాదు. మూడున్నర గంటల సినిమా అది కూడా పెద్దలకు మాత్రమే సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకుని ఇంత ఘనవిజయం సాధించడం ఎవరూ ఊహించనిది. దెబ్బకు దురంధర్ 2 డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. మార్చి 19 విడుదలకు ఇంకా టైం ఉన్నప్పటికీ హక్కుల కోసం బయ్యర్లు ఎగబడుతుంటారు.

లెక్కల సంగతి కాసేపు పక్కనపెడితే దురంధర్ నేర్పించే పాఠాలు ఎన్నో ఉన్నాయి. విపరీతమైన ప్రమోషన్లు, దేశమంతా తిరిగి హడావిడి చేసే పబ్లిసిటీ, మీడియాని ఊరూరా తిప్పుతూ చేసే ప్రచారం ఇవేవి లేకుండా కేవలం కంటెంట్ లో దమ్ముంటే జనం ఎంత బ్రహ్మరధం పడతారో ఈ స్పై థ్రిల్లర్ నిరూపించింది.

పాకిస్థాన్ లో బ్యాన్ చేసినా పైరసీలో చూడాలని మిలియన్ల సంఖ్యలో అక్కడి ప్రేక్షకులు డౌన్లోడ్ చేసుకోవడం దీని క్రేజ్ కు నిదర్శనం. ఇప్పట్లో దురంధర్ ని టచ్ చేసే మరో బ్లాక్ బస్టర్ అంత ఈజీగా హిందీలో రాకపోవచ్చని విశ్లేషకులు బల్లగుద్ది చెబుతున్నారు. రెస్పాన్స్ చూస్తుంటే అదే నిజమైనా ఆశ్చర్యం లేదు. 

This post was last modified on December 26, 2025 2:33 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

టాలీవుడ్‌పై కోలీవుడ్ కన్ను

తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా నంబర్ వన్ పొజిషన్‌లో ఉంది. వందల కోట్ల వసూళ్లు, మాస్ ఆడియన్స్ పల్స్…

3 minutes ago

ప్ర‌భాస్ ఫ్యాన్స్ బూతులు… ప్రొడ్యూసర్ ఫిర్యాదు

రాజాసాబ్ సినిమా మీద ప్ర‌భాస్ అభిమానులు పెట్టుకున్న ఆశ‌లు, అంచ‌నాలు నిల‌బ‌డ‌లేదు. సంక్రాంతి కానుక‌గా భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన…

1 hour ago

ఉస్తాద్ ముందుకు రావడం మంచిదే

సంక్రాతి సినిమాల సందడి ఒకవైపు కొనసాగుతుండగానే ఇంకోవైపు భవిష్యత్తులో విడుదల కాబోతున్న ప్యాన్ ఇండియా మూవీస్, వాటి రిలీజ్ డేట్ల…

1 hour ago

హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్… సిట్ ను ప్రశ్నించిన కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ…

2 hours ago

అనిల్ రావిపూడి చెప్పిన స్టార్ మంత్రం

మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్లు ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోకుండా అనేక ప్రయోగాలు చేస్తుంటారు. అతి సామాన్యమైన పాత్రలు…

2 hours ago

బాలయ్య కోసం కొత్త కథ రెడీ

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ స్పీడే వేరు. స్టార్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలి, ఏడాదికి ఒక్క చిత్రమైనా…

4 hours ago