ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యుత్తమ డ్యాన్సర్ల లిస్టు తీస్తే.. అగ్ర స్థానానికి గట్టి పోటీదారుగా ఉంటాడు హృతిక్ రోషన్. తన తొలి చిత్రం ‘కహోనా ప్యార్ హై’తోనే అతను టాప్ డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అందులో ఇక్‌బల్ కా జీనా స్టెప్పులకు అప్పట్లో యూత్ ఊగిపోయారు. తర్వాత మరెన్నో చిత్రాల్లో హృతిక్ అదిరిపోయే డ్యాన్సులతో యువతను ఉర్రూతలూగించాడు. డ్యాన్సుల్లో హృతిక్‌ను మ్యాచ్ చేయడం ఇంకెవ్వరికీ సాధ్యం కాదని అభిప్రాయపడుతారు అందరూ.
ఐతే ఇప్పుడు హృతిక్‌ను మ్యాచ్ చేయడానికి ఒకరికి ఇద్దరు వచ్చారు. వాళ్లే.. హృదాన్ రోషన్, హ్రెహాన్ రోషన్. ఈ పేర్లు చూస్తేనే అర్థమవుతోంది కదా? వాళ్లిద్దరూ హృతిక్ తనయులని. ఈ ఇద్దరూ ఒక వేడుకలో హృతిక్‌తో డ్యాన్స్ చేశారు. అందులో తండ్రితో సమానంగా అదిరిపోయే గ్రేసుతో డ్యాన్సులేసిన హృదాన్, హ్రెహాన్.
తండ్రీ కొడుకులు కలిసి ఇలా డ్యాన్స్ చేయడం చూసి హృతిక్ ఫ్యాన్స్ అమితానందానికి గురవుతున్నారు. హృదాన్, హ్రెహాన్.. తండ్రికి తగ్గ తనయులని కితాబిస్తున్నారు.
తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. వీళ్లిద్దరూ తెరంగేట్రం చేయడం ఖాయమనే భావిస్తున్నారు. ఆ దిశగా ఇద్దరూ ప్రిపరేషన్లోనే ఉన్నారని ఈ స్టెప్పులు చూస్తే అర్థమవుతోంది.
హృదాన్, హ్రెహాన్ ప్రస్తుతం టీనేజీలో ఉన్నారు. ఇంకో ఐదారేళ్ల తర్వాత ఒకరి తర్వాత ఒకరు డెబ్యూ చేసే అవకాశముంది. ఈ ఏడాది ‘వార్-2’ చిత్రంతో పలకరించిన హృతిక్.. కొత్త సినిమా ఏదీ సైన్ చేయలేదు. అతను స్వీయ దర్శకత్వంలో ‘క్రిష్-4’ చేయడానికి ప్రిపేరవుతున్నట్లు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates