ఏడాది చివరి వారంలో టాలీవుడ్ బాక్సాఫీస్ చిన్న, మీడియం రేంజ్ సినిమాలతో సందడిగా కనిపిస్తోంది. మాములుగా ఈ డేట్ లో ఒకటి రెండు పెద్ద మూవీస్ తప్ప తీవ్రమైన పోటీ ఉండేది కాదు. కానీ ఈసారి సీన్ వేరే ఉంది. విశేషమంటే అరడజను రిలీజులున్నా పాజిటివ్ వైబ్స్ కనిపించడం.
ఆది సాయికుమార్ ‘శంభాల’కు ప్రీమియర్ల స్ట్రాటజీ వర్కౌట్ అయినట్టే ఉంది. ఎర్లీ రిపోర్ట్స్ సానుకూలంగా ఉన్నాయి. సాధారణంగా ఉండే హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ వన్ టైం వాచ్ అనే మాట అధిక శాతం వినిపిస్తోంది. రెగ్యులర్ షోలకు వెళ్లే కామన్ ఆడియన్స్ కూడా ఇదే మాట అన్నారంటే డైలాగు కింగ్ వారసుడికి హిట్ దక్కినట్టే.
ఇక ‘దండోరా’ విషయానికి వస్తే సీరియస్ ఇష్యూని చాలా ఇంటెన్స్ డ్రామాతో రూపొందించిన విధానం ట్రైలర్ లోనే చూపించారు. సెన్సార్ సమస్య వల్ల అనుకున్న టైంకి రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేయలేకపోయినా సద్దుమణిగిన తర్వాత వేసిన షోల నుంచి టాక్ బాగుండటం దర్శక నిర్మాతలను సంతోషంలో ముంచెత్తుతోంది.
ఇక సీరియస్ హారర్ ‘ఈషా’ సంగతి చూస్తే ఖచ్చితంగా భయపెడదామని నిర్మాతలు బన్నీ వాస్, వంశి నందిపాటి అన్న మాటలు నిజమే అనిపించేలా సోషల్ మీడియా రియాక్షన్లు కనిపిస్తున్నాయి. కాకపోతే సాధారణ ప్రేక్షకుల నుంచి ఆ టాక్ వస్తే ఈజీగా పికప్ అయ్యే ఛాన్స్ ఉంది.
‘పతంగ్’కు త్రివిక్రమ్ శ్రీనివాస్ మద్దతు దక్కడం ఏ మేరకు ఉపయోగపడుతుందో టాక్ ని బట్టి చూడాలి. సురేష్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండటంతో కంటెంట్ లో ఏదో ఒక విషయం ఉండే ఉంటుంది. ‘బ్యాడ్ గర్ల్స్’ మీద పెద్ద బజ్ లేదు కానీ దర్శకుడు మున్నా బృందం సడన్ సర్ప్రైజ్ ఇస్తామని ధీమాగా ఉంది.
ఇవన్నీ ఒక ఎత్తయితే పెద్ద బడ్జెట్ తో రూపొందిన రోషన్ మేక ‘ఛాంపియన్’ మీద మంచి అంచనాలున్నాయి. పీరియాడిక్ డ్రామా కావడంతో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. టాక్ బాగుంటే పూర్తి డామినేషన్ తీసుకొచ్చు. మోహన్ లాల్ డబ్బింగ్ మూవీ ‘వృషభ’ ఇంత కాంపిటీషన్ లో కనీస బజ్ లేక పోరాడుతోంది.
This post was last modified on December 24, 2025 10:08 pm
తెలుగు సినిమా తెరమీద రక్తం పారుతోంది. ఒకప్పుడు హత్యలు లాంటి షాట్స్ చూపించేటప్పుడు వీలైనంత వయొలెన్స్ ఎక్స్ పోజ్ కాకుండా…
నిన్నటిదాకా బాలీవుడ్ వర్గాల్లో వినిపించిన మాట దురంధర్ 2 విడుదల ముందు ప్రకటించినట్టు మార్చి 19 ఉండదని. కానీ ఇప్పుడు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన శపథం చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు ఎట్టిపరిస్థితిలోనూ మరోసారి అధికారం…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి వార్తల్లోకి వచ్చేశారు. వెంకటేష్ తో సైలెంట్ గా ఆదర్శ కుటుంబం ఏకె 47…
మొన్న దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ అన్న మాటల దుమారం ఇప్పట్లో ఆగేలా లేదు. మహిళల వస్త్రధారణ…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్లీమళ్లీ వైసిపికి వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. నాలుగు రోజుల కిందట…