నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ చిత్రీకరణ వేగంగానే జరుగుతుందని తెలుస్తోంది. అనుకున్న ప్రకారమే మార్చి 26న తమ చిత్రాన్ని విడుదల చేయడానికి చూస్తోంది చిత్ర బృందం. ఐతే ఇప్పటిదాకా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. విలన్ పాత్ర చేస్తున్న మోహన్ బాబు గురించి అధికారిక ప్రకటన చేశారు. ఆయన ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు.
ఇటీవలే సంపూర్ణేష్ బాబు చేస్తున్న బిరియాని పాత్రకు సంబంధించిన లుక్ కూడా లాంచ్ చేశారు. కానీ హీరోయిన్ గురించి మాత్రం ఏ ప్రకటనా లేదు. ఇందులో ‘డ్రాగన్’ భామ కాయదు లోహర్ కథానాయికగా నటించబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అది నిజమా కాదా అన్న స్పష్టత లేదు. కానీ కాయుదు తాజాగా ఒక సోషల్ మీడియా పోస్టుతో ఈ విషయాన్ని చెప్పకనే చెప్పింది.
‘ది ప్యారడైజ్’ గ్లింప్స్‌ను తన ఇన్‌స్టా పేజీలో షేర్ చేసిన కాయదు.. లవ్ ఎమోజీలు పెట్టింది. సడెన్‌గా ఈ వీడియో పెట్టడాన్ని బట్టి ఆమె ఈ చిత్రంలో నటిస్తోందని స్పష్టమైంది. కాయదు ఇటీవలే ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లోకి అడుగు పెట్టిందని.. ఆమె మీద కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారని సమాచారం. త్వరలోనే ఆమె ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇన్‌స్టాలో ఆ సినిమా గ్లింప్స్‌ను షేర్ చేసినట్లు కనిపిస్తోంది.
ఈ చిత్రంలో అన్ని పాత్రల లుక్స్ రా అండ్ రస్టిగ్గా ఉన్నాయి. మరి అల్ట్రా గ్లామరస్‌గా కనిపించే కాయదుతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎలాంటి పాత్ర చేయిస్తున్నాడో.. తన లుక్ ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరం. కచ్చితంగా ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుందనే అంచనా వేస్తున్నారు నెటిజన్లు. నాని, శ్రీకాంత్ కాంబినేషన్లో ‘దసరా’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన సుధాకర్ చెరుకూరినే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 24, 2025 5:15 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…