ప్రతి ఏడాది చివరికి వచ్చేసరికి ఆ సంవత్సరంలో ఎక్కువ ఆదరణ సంపాదించుకున్న, వార్తల్లో ఉన్న, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన వ్యక్తుల జాబితాలు వస్తుంటాయి. అందులో ఎక్కువగా సినీ హీరోలు, హీరోయిన్లే టాప్‌లో కనిపిస్తుంటారు. అందులో విలన్ పాత్రలు పోషించే నటుల పేర్లు కనిపించడం అరుదు. ఐతే 2020లో మాత్రం కథ మారిపోయింది.
వివిధ భాషల్లో సూపర్ స్టార్లయిన హీరోలందరినీ వెనక్కి నెట్టేసి ఓ విలన్ టాప్‌లో కనిపిస్తున్నాడు. ఆ నటుడు సోనూ సూద్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా-లాక్‌డౌన్ టైంలో అసాధారణ రీతిలో సేవా కార్యక్రమాలు చేసి జనాల దృష్టిలో దేవుడైపోయాడు సోనూ. కరోనా ప్రభావం తగ్గి, లాక్ డౌన్ ఎత్తేశాక కూడా సోనూ సేవ ఆగిపోలేదు.
ఈ నేపథ్యంలోనే అతను ఆసియా స్థాయిలో 2020లో అత్యధిక ఆదరణ సంపాదించుకున్న సెలబ్రెటీగా నిలిచాడు. యూకే బేస్డ్ మీడియా సంస్థ ఈస్టర్న్ ఐ 2020 సంవత్సరానికి వరల్డ్ వైడ్ మోస్ట్ పాపులర్ సెలబ్రెటీల జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో ఆసియా స్థాయిలో సోనూనే అగ్రస్థానంలో నిలిచాడు. హాలీవుడ్ స్థాయికి ఎదిగిన ప్రియాంక చోప్రా, బాహుబలితో బాలీవుడ్ సూపర్ స్టార్లను వెనక్కి నెట్టేసిన ప్రభాస్ ఈ జాబితాలో టాప్-10లో చోటు దక్కించుకున్నారు.
ప్రియాంకకు ఆరో స్థానం దక్కగా, ప్రభాస్ ఏడో స్థానంలో నిలిచాడు. ఖాన్ త్రయంలో ఎవ్వరూ టాప్-10లో లేరు. సోనూ ఇండియా వరకు తిరుగులేని పాపులారిటీ సంపాదించాడు కానీ.. ఆసియా స్థాయిలో నంబర్ వన్‌గా నిలవడం చిన్న విషయం కాదు. తాజాగా సేవా కార్యక్రమాలకు సోనూ దగ్గర నిధులు నిండుకుంటే తన ఆస్తులు తనఖా పెట్టి మరీ డబ్బులు తీసుకుని ఉపయోగిస్తున్న వైనం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసింఏద.
This post was last modified on December 10, 2020 9:52 pm
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…