అవంతిక వందనపు.. తెలుగులో బాల నటిగా నటించి.. ఆ తర్వాత మాయమైన ఈ అమ్మాయి గత ఏడాది హాలీవుడ్ మూవీలో మెరిసి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. బాల నటిగా బ్రహ్మోత్సవం, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, అజ్ఞాతవాసి లాంటి చిత్రాల్లో మెరిసిన అవంతిక.. ‘స్పిన్’; ‘మీన్ గర్ల్స్’ చిత్రాలతో హాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
క్యూట్‌గా కనిపించే చిన్నపాపలా తెలుగు ప్రేక్షకులకు గుర్తున్న అవంతిక.. ‘మీన్ గర్ల్స్’ కోసం చేసిన హాట్ డ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేసేసింది. ఈ సినిమా ప్రమోషన్లలో అవంతిక లుక్స్, తన అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లిష్ చూసి మన వాళ్లు దిమ్మదిరిగింది. ఐతే రోమ్‌లో ఉన్నపుడు రోమన్‌లా ఉండాలన్న సామెతను గుర్తు చేస్తూ పక్కా హాలీవుడ్ హీరోయిన్ లాగా దర్శనమిచ్చిన అవంతిక.. ఇప్పుడు తెలుగులోకి రీఎంట్రీ ఇస్తోంది. క్రిస్మస్ వీకెండ్లో రాబోతున్న ‘ఛాంపియన్’ సినిమాలో
స్పెషల్ రోల్ చేసింది అవంతిక.
‘ఛాంపియన్’ నుంచి తాజాగా ఒక డ్యాన్స్ నంబర్ రిలీజ్ చేశారు. అందులో హీరో రోషన్ మేకతో కలిసి అదిరిపోయే స్టెప్పులేసింది అవంతిక. తన డ్యాన్స్ మూమెంట్స్ చూసి అందరూ షాకయ్యారు. మంచి ఎనర్జీ చూపించింది స్టెప్స్‌లో అవంతిక. తన హాట్ లుక్స్ కుర్రాళ్లను ఆకట్టుకుంటున్నాయి. బాలనటిగా క్యూట్ అనిపించిన అమ్మాయి తనేనా అని ఆశ్చర్యపోయేలా ఉన్న తన లుక్స్, స్టెప్స్.
ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తే అవంతికకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావచ్చు. హాలీవుడ్లో సినిమాలు చేసినా అవంతిక తెలుగునేమీ మర్చిపోలేదు. ఈ హైదరాబాద్ అమ్మాయి తెలంగాణ యాస మాట్లాడగలదు. ‘ఛాంపియన్’లో తనది పెద్ద రోలేమీ కాదని తెలుస్తోంది. చిన్న పాత్రలో అయినా తనదైన ముద్ర వేస్తే ఇక్కడ ఛాన్సులకేమీ లోటు ఉండకపోవచ్చు.
This post was last modified on December 22, 2025 3:36 pm
ఏపీకి ప్రతిష్టాత్మకమైన సాగు, తాగునీటి ప్రాజెక్టుతో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా కూడా మారనున్న కీలక ప్రాజెక్టు పోలవరం. ఇది…
బిగ్ బాస్ షో ద్వారా.. ఆ తర్వాత కోర్టు మూవీలో విలన్ పాత్ర ద్వారా మళ్ళీ మంచి పాపులారిటీ సంపాదించి…
వివాదాస్పద ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌ను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ అధికారిక హోదాలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు,…
ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పెట్టుబడుల విషయంలో చంద్రబాబు…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఈసారి రౌడీ జనార్ధనగా రాబోతున్నాడు. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహించిన…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులకు ఎంత ప్రాధాన్యం ఉండేదో తెలిసిందే. సినీ జనాలు ఈ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేవారు.…