‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరో స్నేహితుల బృందంలో ఒకరిగా కనిపించిన అనీశా రెడ్డితో తెలుగువాడైన తమిళ హీరో విశాల్ గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉన్నట్లుండి జరిగిన ఆ ఈవెంట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ వీరి కలయిక ఎంత ఆశ్చర్యపరిచిందో.. నిశ్చితార్థం తర్వాత ఇద్దరూ విడిపోయినట్లు వార్తలు రావడం కూడా అంతే ఆశ్చర్యానికి గురి చేసింది.
ఎంగేజ్మెంట్ జరిగిన కొంత కాలానికి ఆ ఈవెంట్ ఫొటోలన్నింటినీ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి అనీశా తొలగించేయడంతో ఇద్దరి మధ్య ఏదో జరిగిందని అర్థమైంది. తర్వాత వీరి పెళ్లి గురించి సమాచారమే లేకపోయింది. దీని గురించి అనీశా కానీ, విశాల్ కానీ మాట్లాడలేదు. కాగా వీళ్లిద్దరూ విడిపోయిన విషయం ఇప్పుడు అధికారికంగా రూఢి అయింది. అనీశా పెళ్లి వేరే వ్యక్తితో జరిగిపోయింది.
హైదరాబాద్‌కే చెందిన ఓ వ్యాపార వేత్తతో అనీశా పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి విశాల్ నుంచి అనీశా ఎప్పుడో విడిపోయి మూవ్ ఆన్ అయిపోయిందని స్పష్టమవుతోంది. మరి వీరి మధ్య ఎందుకు విభేదాలొచ్చాయన్నది తెలియదు. విశాల్ వయసు ఇప్పటికే 43 ఏళ్లకు చేరడం గమనార్హం. అతడి పెళ్లి గురించి దశాబ్దం కిందట్నుంచి వార్తలొస్తున్నాయి.
సీనియర్ నటుడు శరత్ కుమార్ తనయురాలైన వరలక్ష్మితో అతను ప్రేమలో ఉన్నట్లు, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్నేళ్ల ముందు గట్టి ప్రచారమే జరిగింది. ఇద్దరూ సన్నిహితంగా కనిపించి ఆ వార్తలకు బలం చేకూర్చారు కూడా. కానీ తర్వాత వీరి మధ్య ఎందుకో అంతరం వచ్చింది. ఇంతలో విశాల్ వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని ఆశ్చర్యపరిచాడు. కానీ ఆ బంధం నిలవలేదు. మరి వయసు మీదపడ్డ విశాల్ ఎప్పటికైనా అసలు పెళ్లి చేసుకుంటాడా లేదా అన్నది ప్రశ్నార్థకం.
This post was last modified on December 10, 2020 12:45 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…