కూలీలో నాగార్జున విలన్ గా నటిస్తారని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రకటించినప్పుడు అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. చాలా వయొలెంట్ గా ఉంటుందని, రక్షకుడులో ఆయన స్వాగ్ కి ఫ్యాన్ అయ్యాక అప్పటి నుంచే ఇలాంటి క్యారెక్టరైజేషన్ రాసుకున్నానని చాలా కబుర్లు చెప్పాడు. తీరా చూస్తే రెండు మూడు స్టయిలిష్ షాట్లు తప్ప సైమన్ గా నటించిన నాగార్జున పాత్ర పరమ రొటీన్ గా ఉంది. మర్డర్లు చేయించాడు కానీ అవి ఎలాంటి ఇంపాక్ట్ చూపించేలేకపోయాయి. నిజానికి ఇది వర్కౌట్ అయితే మరిన్ని ప్రయోగాలు చేసేందుకు నాగ్ సిద్ధపడ్డారు. కాకపోవడంతో తిరిగి సోలో హీరోగా తన పాత రూటుకు వచ్చేశారు.
ఇక్కడ దురంధర్ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం. అక్షయ్ ఖన్నా పోషించిన రెహమాన్ డెకాయిట్ పాత్ర ఎంత అద్భుతంగా పేలిందో చూస్తున్నాం. హీరో రణ్వీర్ సింగ్ కన్నా ఎక్కువ పేరు తనకే వచ్చిందనేది అతిశయోక్తి కాదు. ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ తో ఆయనని దర్శకుడు ఆదిత్య దార్ చూపించిన విధానం చప్పట్లు కొట్టించుకుంది. చివర్లో చనిపోయే ఎపిసోడ్ కూడా టెర్రిఫిక్ గా డిజైన్ చేశారు. హాస్పిటల్ బెడ్ మీద రక్తమోడుతున్నా సిగరెట్ తాగుతూ రణ్వీర్ వైపు క్రూరంగా చూసే ఒక్క షాట్ చాలు తన గురించి చెప్పడానికి. ఇలాంటిదే కనక కూలిలో నాగార్జునకు పెట్టి ఉంటే కంటెంట్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళేది.
అయితే రజనీకాంత్ ఎక్కడ సైడ్ ట్రాక్ అవుతారో లేదా నాగార్జున ఎక్కడ డామినేట్ చేస్తాడో అనే భయం వల్ల సైమన్ ని డౌన్ టోన్ చేసి ఉండొచ్చు కానీ ఒక స్టయిల్ విలన్ ని పరిచయం చేసే అవకాశాన్ని లోకేష్ కనగరాజ్ చేతులారా వృథా చేసుకున్నాడు. దురంధర్ చూశాక మూవీ లవర్స్ ఇదే ఫీలవుతున్నారు. లెజెండ్ తర్వాత జగపతిబాబు ఏ స్థాయికి వెళ్లారో అంతకన్నా పెద్ద రేంజ్ లో ఒక స్పెషల్ విలన్ స్టేటస్ నాగార్జునకి దక్కేదని భావిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కూలి ఫ్లాప్ కావడం నాగ్ ఫ్యాన్స్ కి సంతోషమే. ఇకపై నెగటివ్ రోల్స్ కి దూరంగా ఉండి కేవలం హీరోగా చేస్తారని ఫిక్స్ అయ్యారు. మరి నాగార్జున మనసులో ఏముందో.
This post was last modified on December 21, 2025 10:13 pm
వైసీపీ అధినేత జగన్.. తన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల మధ్య దాదాపు అందరికీ తెలిసి.. మూడున్నరేళ్లకుపైగానే…
ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మాటలు విని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమకు అన్యాయం…
మాములుగా ఎంత స్టార్ హీరో అయినా ఫ్లాప్ టాక్ వస్తే నిలదొక్కుపోవడం చాలా కష్టం. కానీ అఖండ తాండవం 2కి…
వరల్డ్ కప్ అనగానే అందరూ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ గురించే హైప్ ఎక్కించుకుంటారు. కానీ అసలు సినిమా గ్రూప్ స్టేజ్…
ఏపీ రాజకీయాలను ఫాలో అవుతున్న వారికి బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏపీలో…