మెగాస్టార్ చిరంజీవి లైనప్‌లో అభిమానులకు అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఆయన నటించబోయేదే. మన శంకర వరప్రసాద్, విశ్వంభర చిత్రాలను మించి దాని మీద అంచనాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ‘దసరా’తో సెన్సేషన్ క్రియేట్ చేసి, ‘ది ప్యారడైజ్’తో మరోసారి బాక్సాఫీస్ షేక్ చేసేలా కనిపిస్తున్న శ్రీకాంత్ దర్శకత్వంలో చిరు నటిస్తే ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది.
శ్రీకాంత్‌ను వెలుగులోకి తెచ్చిన నాని.. చిరుతో అతడి సినిమాను సెట్ చేయడమే కాక, స్వయంగా నిర్మించడానికి ముందుకు రావడంతో ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ వచ్చింది. ఈ సినిమా గురించి తాజాగా నిర్మాత సుధాకర్ చెరుకూరి అప్‌డేట్ ఇచ్చారు. నాని, శ్రీకాంత్ కలయికలో వరుసగా రెండో చిత్రాన్ని నిర్మిస్తున్న సుధాకర్.. చిరు సినిమాను కూడా నానితో కలిసి ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.
చిరు, శ్రీకాంత్ సినిమా వచ్చే ఏడాది మధ్యలో సెట్స్ మీదికి వెళ్తుందని సుధాకర్ చెరుకూరి వెల్లడించారు. శ్రీకాంత్ ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమాలో బిజీగా ఉంటూనే.. చిరు సినిమా స్క్రిప్టు వర్క్ చేస్తున్నట్లు సుధాకర్ తెలిపారు. ‘ది ప్యారడైజ్’ నుంచి పూర్తిగా ఫ్రీ అయ్యాక చిరు సినిమా మీద మరింత ఫోకస్ పెడతాడని.. తర్వాత 2026 జులైలో షూట్ మొదలు కావచ్చని ఆయన సంకేతాలు ఇచ్చారు.
ఐతే మరోవైపు బాబీ సినిమా కూడా సరిగ్గా అదే సమయానికి మొదలు పెడతారన్నది ఇండస్టీ టాక్. వర ప్రసాద్ గారు రిలీజ్ అయిన వెంటనే బాబీ తో మొదలు పెడతారా లేక రెండు ఒకేసారి మొదలుపెడతారా అన్నది తెలియాలంటే మరికొన్ని ఆగాల్సిందే.
This post was last modified on December 21, 2025 12:54 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…