Movie News

రాజా సాబ్ అపార్థాలకు బ్రేకేసిన నిర్మాత

ఇటీవలే ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ రాజా సాబ్ కు అనుకున్నంత పెద్ద నెంబర్ నాన్ థియేటర్ రైట్స్ నుంచి రాలేదని, కానీ మార్కెట్ అలా ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే మేం అమ్మకం చేశామని చెప్పుకొచ్చారు. అంతే ఈ పాయింట్ యాంటీ ఫ్యాన్స్ దొరకబుచ్చుకున్నారు. ప్రభాస్ రేంజ్ తగ్గిపోయిందని, డిమాండ్ లేదని ఇలా రకరకాలుగా అర్థాలు తీసి కొందరు ఏకంగా ట్రోలింగ్ కూడా చేశారు. ఇదంతా గమనించిన విశ్వప్రసాద్ సోషల్ మీడియా వేదికగా కుండబద్దలు కొట్టారు. బయట జరుగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టే ఉద్దేశంతో క్లారిటీ ఇచ్చారు.

అంతర్గతంగా తమ వ్యాపారాలకు సంబంధించి ఏవైతే నెంబర్లు ఉన్నాయో అవి బయటికి చెప్పడం సాధ్యం కాదని, పోస్ట్ రిలీజ్ అయిన తర్వాత వాటిని మేమే అధికారికంగా ప్రకటిస్తాం తప్పించి, థియేటర్ అనుభూతి దక్కించుకోవాల్సిన అభిమానులు ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టొద్దని కోరారు. మార్కెట్ ఎంత ఎగుడుదిగుడుగా ఉన్నా వర్తమానంలో బెస్ట్ డీల్ రాజా సాబ్ కే వచ్చిందని నొక్కి చెప్పారు. పోలికలు అనవసరం అంటూ కొట్టి పారేశారు. ఆయన చెప్పింది నిజమే. రాజా సాబ్ కు ప్రధానంగా పని చేస్తోంది ప్రభాస్ ఇమేజే అనేది ఎవరూ కాదనలేని నిజం. అందుకే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అంత భారీ బడ్జెట్ పెట్టింది.

హారర్ జానర్ కావడం, దర్శకుడు మారుతీ ట్రాక్ రికార్డు లాంటి ఒకటి రెండు కారణాలు ప్రభావం చూపించి ఉండవచ్చేమో కానీ పాజిటివ్ టాక్ వస్తే రాజా సాబ్ ని బాక్సాఫీస్ దగ్గర కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎంత పోటీ ఉన్నా సరే జనాలను డార్లింగ్ లాగేస్తాడు. టీమ్ ధీమా కూడా అదే. రెండు టీజర్లు, రెండు పాటలు ఆల్రెడీ వచ్చేశాయి. డిసెంబర్ 27 ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. వేదిక ఇవాళో రేపో ఫైనల్ అవుతుంది. కొత్త ట్రైలర్ లాంచ్ చేస్తారు. మరో రెండు పాటలు రిలీజ్ కు ముందే వచ్చేస్తాయి. పెద్ద బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలో దిగుతున్న రాజా సాబ్ కు అవతల అరడజను సినిమాలు కాంపిటీషన్ ఇస్తున్నాయి.

This post was last modified on December 21, 2025 12:45 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

30 ఏళ్ల తర్వాత మణిరత్నం, కొయిరాలా కలిసి…

బొంబాయి.. ఇండియన్ ఫిలిం హిస్టరీలో మైలురాయిలా నిలిచిపోయిన చిత్రాల్లో ఇదొకటి. 90వ దశకంలో ‘రోజా’తో సంచలనం రేపాక, ‘బొంబాయి’ మూవీతో…

1 hour ago

లెజెండరీ నటుడి ఆఖరి కోరిక తీరదేమో

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో, అతి పెద్ద స్టార్లలో ఒకడైన ధర్మేంద్ర ఇటీవలే కాలం చేశారు. ‘షోలే’…

2 hours ago

టీమ్ లో గిల్ లేకపోవడం మంచిదే

నిన్నటి నుంచి అందరూ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ గురించే మాట్లాడుకుంటున్నారు. వైస్ కెప్టెన్ రేంజ్ లో ఉన్న శుభ్‌మన్…

3 hours ago

వీసా రెన్యూవల్… మనోళ్లకు మరో బిగ్ షాక్!

అమెరికాలో ఉద్యోగం చేస్తూ, వీసా రెన్యూవల్ కోసం ఇండియా వచ్చిన వారికి పెద్ద షాక్ తగిలింది. డిసెంబర్ 15 తర్వాత…

5 hours ago

చిరు-ఓదెల ముహూర్తం కుదిరింది కానీ…

మెగాస్టార్ చిరంజీవి లైనప్‌లో అభిమానులకు అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఆయన నటించబోయేదే. మన శంకర…

5 hours ago

రెడ్ల‌ను వ‌దిలేసి జ‌గ‌న్ రాజ‌కీయం.. ఫ‌లించేనా..!

రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకుని జగన్ గత ఎన్నికల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారంలోకి వస్తామని పదేపదే చెప్పినప్పటికీ,…

5 hours ago