ఒక బాలీవుడ్ మూవీ మూడో వారంలోనూ సూపర్ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఎన్ని నెలలయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం. అది కూడా రిలీజ్ కు ముందు నెగటివ్ వైబ్రేషన్స్ మోసుకుని, ఉద్దేశపూర్వకంగా కొందరు క్రిటిక్స్ నెగటివ్ చేయాలని చూసినా తట్టుకుని ఫైనల్ గా ఇండస్ట్రీ హిట్ వైపు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం పుష్ప 2 హిందీ వెర్షన్ పేరుమీదున్న ఎనిమిది వందల కోట్ల పై చిలుకు నెంబర్ ని టార్గెట్ చేసిన దురంధర్ చాలా వేగంగానే అందుకునేలా ఉన్నాడు. ప్యాన్ ఇండియా లేకుండా కేవలం సింగల్ లాంగ్వేజ్ లో వచ్చి రికార్డులు బద్దలు కొట్టిన మూవీగా దురంధర్ సాధించబోయే మైలురాళ్ళు ఇంకా చాలానే ఉన్నాయి.
ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ అవతార్ ఫైర్ అండ్ యాష్ వచ్చిన తర్వాత దురంధర్ స్పీడ్ తగ్గుతుందేమోనని ట్రేడ్ వర్గాలు అనుమానించాయి. కానీ ఆ సూచనలు లేవు. దర్శకుడు జేమ్స్ క్యామరూన్ ఈసారి పూర్తి స్థాయి అంచనాలు అందుకోలేదని పబ్లిక్ టాక్ చూస్తే అర్థమైపోతుంది. రివ్యూలు కూడా అధిక శాతం పెదవి విరిచాయి. విజువల్ ఎఫెక్ట్స్ ఎంత అద్భుతంగా ఉన్నా అదే కథను తిప్పి తిప్పి మూడున్నర గంటలు చూపించారనే కంప్లైంట్ ఎక్కువగా వినిపిస్తోంది. వీకెండ్ వరకు బాగానే ఉన్నా తర్వాత నెమ్మదించడం ఖాయమని డిస్ట్రిబ్యూటర్లకు అర్థమైపోయింది. దీంతో దురంధర్ షోలు మళ్ళీ పెరుగుతున్నాయి.
విచిత్రం ఏమిటంటే దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో దురంధర్ ఇంకా కొనసాగుతోంది. పబ్లిక్ డిమాండ్ ఉండటంతో ఇంకా రన్ ఇచ్చేందుకు థియేటర్ యజమాన్యాలు ముందుకొస్తున్నాయి. పైగా నార్త్ లో అఖండ తాండవం 2 నిరాశపరిచే దిశగా వెళ్తుండటంతో దాని కౌంట్ తగ్గిపోయి దురంధర్ నెంబర్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీల మద్దతు దురంధర్ కు పెరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా, రామ్ గోపాల్ వర్మ, అల్లు అర్జున్ తదితరులు దర్శకుడు ఆదిత్య ధార్ తో పాటు టీమ్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.చూస్తుంటే వెయ్యి కోట్లు దాటనిదే దురంధర్ శాంతించేలా లేడు.
This post was last modified on December 20, 2025 12:04 pm
కొత్త జిల్లాల ఏర్పాటు అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. ఈ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేస్తుందని వారు…
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్‌కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…