పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం కోసం బలమైన పోటీదారుగా ఉన్నాడు. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి చిత్రాలతో రికార్డులు కూడా బద్దలు కొట్టాడు. కానీ ఆ తర్వాత ఆయన రాజకీయాల వైపు అడుగులు వేయడంతో సినిమాల మీద ఫోకస్ తగ్గిపోయింది. మిగతా హీరోలు పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోతుంటే.. నంబర్ గేమ్‌లో పవన్ కళ్యాణ్ వెనుకబడిపోయాడు.
అభిమానులు రికార్డుల గురించి మాట్లాడుకునే పరిస్థితి లేకపోయింది. రీఎంట్రీలో వరుసగా మూడు రీమేక్ సినిమాల్లో నటించి ఓ మోస్తరు ఫలితాలను అందుకున్న పవన్.. స్ట్రెయిట్ మూవీ ‘హరిహర వీరమల్లు’తో పెద్ద డిజాస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఐతే చివరగా ఆయన్నుంచి వచ్చిన ‘ఓజీ’ మాత్రం అభిమానులను మురిపించింది. భారీ వసూళ్లతో పవన్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
అంతే కాదు.. ఓజీ ఈ ఏడాదికి టాలీవుడ్ నుంచి నంబర్ వన్ సినిమాగా నిలిచింది. ఈ ఏడాది భారీ చిత్రాల సందడి పెద్దగా లేదు. ‘ఓజీ’ రావడానికి ముందు విక్టరీ వెంకటేష్ సంక్రాంతి సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’దే హైయెస్ట్ గ్రాసర్ రికార్డు. ఆ చిత్రం రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఈ ఏడాదికి నంబర్ వన్ సినిమాగా కొనసాగింది. ఐతే ‘ఓజీ’ వచ్చి ఆ వసూళ్లను దాటేసింది. ఫుల్ రన్లో ఆ చిత్రం రూ.320 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది.
ఆ తర్వాత దాన్ని అధిగమించగల సత్తా ఉన్న సినిమాగా ‘అఖండ-2’ను పరిగణించారు. కానీ ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. తెలుగులో ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిన బాలయ్య చిత్రం.. ఇతర భాషల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇంకా ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి కాలేదు. కానీ ఫుల్ రన్ కలెక్షన్లు రూ.120 కోట్లను అందుకుంటే ఎక్కువ అన్నట్లుంది. కాబట్టి ఈ ఏడాదికి పవనే టాలీవుడ్ నుంచి నంబర్ వన్ హీరో అన్నమాట.
This post was last modified on December 18, 2025 9:31 am
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్‌సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…