2020లో అనేక సినీ కుటుంబాల్లో విషాదాలు నెలకొన్నాయి. వాటిలో కన్నడ నటుడు చిరంజీవి సర్జా మరణం కూడా ఒకటి. సీనియర్ హీరో అర్జున్‌కు మేనల్లుడైన చిరంజీవి.. కొన్ని నెలల కిందట హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. నటి మేఘన రాజ్‌ను పెళ్లి చేసుకుని రెండేళ్లు కూడా కాకముందే అతను ఇలా అర్ధంతరంగా చనిపోవడం అందరిలోనూ విషాదం నింపింది. చిరంజీవి చనిపోయే సమయానికి మేఘన నిండు గర్భిణి కావడం గమనార్హం. ఇటీవలే ఆమె పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సందర్భంగా చిరంజీవి కటౌట్‌ను పక్కన పెట్టుకుని బేబీ షవర్ వేడుక నిర్వహించడం తెలిసిన సంగతే.
ఇప్పుడు వారి కుటుంబంలో బాధాకర పరిస్థితి నెలకొంది. మేఘనతో పాటు ఆమె కొడుకు.. అలాగే మేఘన తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మేఘనే స్వయంగా వెల్లడించింది.
‘‘అవును.. నాతో పాటు మా అబ్బాయి, మా తల్లిదండ్రులకు కరోనా సోకిందని వెల్లడైంది. కానీ మేం ఈ సమయంలో ధైైర్యంగా ఉండి ఈ మహమ్మారిని ఎదుర్కోవాలనుకుంటున్నాం. దీనికి ఎంతమాత్రం భయపడటం లేదు. ఈ పరిస్థితిని సులువుగా అధిగమిస్తామని అనుకుంటున్నా’’ అని మేఘన తెలిపింది.
చిరంజీవి మరణం తాలూకు విషాదం నుంచి కోలుకుంటున్న సమయంలో మేఘన కుటుంబంలో అందరికీ కరోనా సోకడం అభిమానుల్ని కలవరపెడుతోంది. మళ్లీ ఈ కుటుంబానికి ఈ కష్టమేంటని బాధ పడుతున్నారు. మేఘన తల్లిదండ్రులు వయసు మళ్లిన వాళ్లు కావడంతో వారికేం కాకూడదని కోరుకుంటున్నారు. నెలల బిడ్డకు కరోనా సోకడం పట్ల కూడా అయ్యో అనుకుంటున్నారు. మేఘన కుటుంబ వైద్యులు దగ్గరుండి వీరి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వాళ్లంతా ఆసుపత్రిలో చేరబోతున్నట్లు సమాచారం.
This post was last modified on December 9, 2020 8:04 pm
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…