యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీకి ఎదురీత తప్పడం లేదు. అఖండ తాండవం 2 పోటీతో పాటు టాక్ ఆశాజనకంగా లేకపోవడం వసూళ్ల మీద ప్రభావం చూపించింది. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ లో ఓ మోస్తరుగా బుకింగ్స్ ఉన్నాయి కానీ కింది కేంద్రాల్లో పరిస్థితి అంతంత మాత్రమే. కలర్ ఫోటో లాంటి అవార్డు విన్నింగ్ మూవీ ఇచ్చిన సందీప్ రాజ్ మోగ్లీ మీద చాలా నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు పని చేసిన వాళ్లకు ఇదో ఐడి కార్డు అవుతుందని, ఇండస్ట్రీలో ఎవరైనా పిలిచి అవకాశాలు ఇస్తారనే రేంజ్ లో పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చారు. కానీ జరిగింది వేరు.
నాన్ థియేటర్, శాటిలైట్ ద్వారా నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కొంతవరకు సేఫ్ అయ్యుండొచ్చేమో కానీ థియేటర్ కోణంలో చూసుకుంటే మాత్రం ఫెయిల్యూర్ ని తప్పించుకోవడం పెద్ద టాస్క్ లా కనిపిస్తోంది. నిజానికి అఖండ 2కి సైతం యునానిమస్ టాక్ రాలేదు. కానీ బాలయ్య ఇమేజ్, సీక్వెల్ హైప్, ప్రమోషన్లు దానికి రక్షణ కవచంలా నిలబడి వీకెండ్ కలెక్షన్లకు దోహదపడ్డాయి. కానీ మోగ్లీకి అలాంటి బ్యాకప్ లేదు. దీంతో పూర్తిగా టాక్ మీద ఆధారపడాల్సి వచ్చింది. రోషన్ కోసం ప్రత్యేకంగా టికెట్లు కొనే జనాలు లేకపోవడంతో కంటెంట్ ని ఎక్కువ ఫోకస్ చేసి దాన్నే ప్రమోషన్లలో వాడుకున్నారు.
ఇది పెద్ద హిట్ అయితే రోషన్ కనకాలకు ప్రమోషన్ వచ్చినట్టు అయ్యేది. మోగ్లీ రూపంలో వచ్చిన మైలేజ్ సరిపోలేదని చెప్పాలి. పెర్ఫార్మన్స్ పరంగా కుర్రాడు కస్టపడినప్పటికీ అసలు కంటెంట్ స్ట్రాంగ్ గా లేకపోవడం మైనస్ అయ్యింది. అందులోనూ ఇలాంటి సినిమాలకు బలంగా ఉండాల్సిన పాటలను కాలభైరవ బెస్ట్ అనిపించేలా కంపోజ్ చేయలేదు. కనీసం ఒక్క సాంగ్ వైరల్ అయినా ఓపెనింగ్స్ కి దోహదపడేది. కానీ అదీ జరగలేదు. జయంని స్ఫూర్తిగా తీసుకున్న సందీప్ రాజ్ ఆ మేజిక్ రిపీట్ చేయలేకపోయాడు. అందుకే మోగ్లీ బండి మైలేజ్ సరిపోక మధ్యలోనే ఆగుతుందో లేక పికప్ అవుతుందో చూడాలి.
This post was last modified on December 14, 2025 10:18 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…