అభిమానులందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వేరు అని చెప్పొచ్చు. పవన్ ఎంచుకునే కొన్ని సినిమాల విషయంలో వాళ్ల నుంచి మొదట తీవ్ర వ్యతిరేకత వస్తుంటుంది. రీమేక్‌లను ఎంచుకోవడం.. సరైన డైరెక్టర్లతో పని చేయకపోవడం పట్ల వారు తమ అసహనాన్ని చూపిస్తుంటారు. సినిమా మొదలైనపుడు.. మేకింగ్ దశలో ఉండగా నెగెటివ్‌గానే స్పందిస్తుంటారు. కానీ ఆ చిత్రం విడుదలకు సిద్ధమైనపుడు అన్నీ పక్కన పెట్టి సినిమాకు కావాల్సిన హైప్ ఇచ్చేస్తుంటారు.
‘కాటమ రాయుడు’ లాంటి సాధారణమైన సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. రీఎంట్రీలో పవన్ చేసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్‌ల విషయంలోనూ ఇలాగే చేశారు. ‘గబ్బర్ సింగ్’ దర్శకుడు హరీష్ శంకర్‌తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలోనూ పవన్ ఫ్యాన్స్ పెద్దగా ఆసక్తి లేనట్లే కనిపించారు. ఈ సినిమా చాలా ఆలస్యం కావడం.. పైగా రీమేక్ అనే అభిప్రాయంతో దీని మీద తక్కువ అంచనాలతోనే ఉన్నారు ఫ్యాన్స్.
ముందు నుంచి వాళ్ల దృష్టంతా ‘ఓజీ’ మీదే నిలుస్తూ వచ్చింది. సెప్టెంబరులో ‘ఓజీ’ రిలీజైపోయింది. మంచి ఫలితాన్నే అందుకుంది. ఆ తర్వాత ‘ఉస్తాద్..’ గురించి ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోనట్లే కనిపించారు. కానీ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాగానే మొత్తం పరిస్థితి మారిపోయింది. ఇందులో పవన్ వీర లెవెల్లో స్టెప్పులేయడం ద్వారా అభిమానుల దృష్టిని బాగానే ఆకర్షించారు. డ్యాన్సుల్లో పవన్ మామూలుగానే కొంచెం వీక్. పైగా ‘గబ్బర్ సింగ్’ తర్వాత పెద్దగా డ్యాన్సులేసే ప్రయత్నమే చేయలేదు.
దీంతో ‘దేఖ్ లెంగే సాల’ సాంగ్ అభిమానులకు పెద్ద సర్ప్రైజ్‌గా మారింది. తొలి పాటతోనే పవన్-హరీష్-దేవి కలిసి సిక్సర్ కొట్టేశారు. ఈ పాటతో ‘ఉస్తాద్..’ మీద ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. ఇక ముందూ ఇలాంటి ఎగ్జైటింగ్ కంటెంట్ ఇస్తూ పోతే ‘ఉస్తాద్’.. ‘ఓజీ’కి ఏమాత్రం తగ్గని క్రేజ్ సంపాదించుకోవడం.. రిలీజ్ టైంకి పవన్ ఫ్యాన్స్ ఎప్పట్లాగే ఫుల్ హైప్ ఎక్కించుకుని థియేటర్లలోకి అడుగు పెట్టడం ఖాయం.
This post was last modified on December 14, 2025 1:11 pm
అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…
ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. రేవంత్ సర్కార్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌కు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇలాంటి…
రిలీజ్ ముందు బజ్ లేకుండా, విడుదలైన రోజు కొందరు క్రిటిక్స్ దారుణంగా విమర్శించిన దురంధర్ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని…
ఇకపై తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు…