నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’కు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ సినిమాకు ఓపెనింగ్స్ పరంగా ఢోకా లేకపోయింది. ఈ చిత్రంలో యాక్షన్ ఘట్టాల విషయంలో ప్రేక్షకులు రెండు వర్గాలుగా విడిపోయారు. అభిమానులు, మాస్ ప్రేక్షకులు ఆ సీన్లను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మిగతా వాళ్లకు అవి మరీ అతిగా అనిపిస్తున్నాయి.
బోయపాటి సినిమాలంటే లాజిక్కులుండవని, యాక్షన్ ఘట్టాలు అతిగా ఉంటాయని ముందే ఆడియన్స్‌కు ఒక అంచనా ఉంది. కానీ ఇందులో అవి మరీ హద్దులు దాటిపోయాయని అంటోంది రెండో వర్గం. ఇంటర్వెల్ ఎపిసోడ్‌తో పాటు ద్వితీయార్ధంలో వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్సుల్లో దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరీ ఇంత అతేంటి.. ఇందులో ఏమైనా లాజిక్ ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలపై బోయపాటి శ్రీను ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు.
“అఖండ అష్టసిద్ధి సాధించినవాడు. అష్ట దిగ్బంధనానికి వెళ్లిపోయి 12 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చినవాడు. అతనొక సూపర్ హీరో. వాళ్లకు అస్సలు లాజిక్కా మ్యాజిక్కా అన్నది తీసేస్తే.. నానో ఆకారానికి వెళ్లగలరు. అలాగే విశ్వరూపం చూపించగలరు. కానీ మనం అక్కడి వరకు వెళ్లలేదు. ఇప్పుడు కరెక్ట్ కాదులే అని అవన్నీ చూపించలేదు. కేవలం ఆయుధంతో మాత్రమే గేమ్ ఆడాం. సూపర్ హీరోను బట్టి ఆ టైమింగ్‌ను బట్టి, ఆ సిచువేషన్ని బట్టి ఏ విధంగా అయినా మారతాడు. ఏది చేసినా సరే ఆయనకు లాజిక్ అనేది అవసరం లేదు. ఎందుకంటే అష్టసిద్ధి సాధకుడు అనే విషయం మొదటి రీల్‌లోనే చెప్పేశాం. దీనికి ఒక లాజిక్ కూడా ఉంది. కథను అలా మొదలుపెట్టాకే మిగతా విషయాలు చూపించాం. అఖండ అలాంటి శక్తి చూపించడంలో లాజిక్ లేకుండా ఏమీ లేదు” అని బోయపాటి వివరించాడు.
This post was last modified on December 13, 2025 6:40 pm
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…
తెలంగాణ ప్రభుత్వం... పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తామని చెబుతున్న హైదరాబాద్‌లో గన్ కల్చర్ పెరుగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వ్యక్తిగతంగా…
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న…
తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకో లేదా దేశానికో పరిమితం కాలేదు. గ్లోబల్ మార్కెట్లో టాలీవుడ్ సృష్టించిన…
స్థానిక సంస్థల ఎన్నికలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు సంవత్సరాల పాలనకు ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తున్న రేవంత్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం…