Movie News

ఆది పినిశెట్టి… ఇలా జరిగిందేంటి

టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా తన గ్రాఫ్ మారిపోయింది. అల్లు అర్జున్ కు ధీటుగా నిలబడే ప్రతినాయకుడిగా దర్శకుడు బోయపాటి చూపించిన విధానం ఆ బ్లాక్ బస్టర్లో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత అజ్ఞాతవాసి, వారియర్ లాంటి వాటిలో విలన్ గా చేశాడు కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. మళ్ళీ హీరోగా కంటిన్యూ అవుతూ కొన్ని సినిమాలు చేసినా అవేవి వర్కౌట్ కాలేదు. గత ఏడాది వచ్చిన శబ్దం సైతం ఫ్లాపుల లిస్టులోకి చేరిపోయింది. చాలా గ్యాప్ తర్వాత ఆది పినిశెట్టి ఒకేరోజు రెండు సినిమాలతో పలకరించాడు.

నిన్న విడుదలైన అఖండ 2లో మాంత్రికుడు నేత్రగా చేతబడులు చేసే పాత్రలో డిఫరెంట్ గా ట్రై చేశాడు. అయితే మెయిన్ విలన్లు మరో ఇద్దరు ఉండటంతో పాటు నిడివి పరంగా ఆది పినిశెట్టి ఎక్కువ సేపు లేకపోవడం ఫ్యాన్స్ లోటుగా ఫీలయ్యారు. అఖండ 2 కమర్షియల్ సక్సెస్ ఎంతనేది పక్కనపెడితే ఎక్కువ ప్రాధాన్యం ఉంటే కనక ఆది పినిశెట్టికి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ దక్కేది. ఇక రెండోది డ్రైవ్ అనే డబ్బింగ్ మూవీ. ఇది వచ్చిన సంగతే జనాలు గుర్తించలేదు. మెయిన్ సెంటర్స్ లో షోలైతే దక్కాయి కానీ వాటిలో క్యాన్సిల్ కాకుండా ఎన్ని రన్ అయ్యాయో చెప్పడం కష్టం. అంత బలహీన పబ్లిసిటీ జరిగింది.

ఏమైనా ఆది పినిశెట్టి ఈ ఫ్రైడే సంతృప్తికరంగా జరగలేదు. అఖండ 2లో మిగిలినవాళ్లు హైలైట్ అయినంతగా తనకు గుర్తింపు రాలేదన్నది నిజం. అయితే ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్లు మరిన్ని చేయొచ్చనే కాన్ఫిడెన్స్ బాలయ్య సినిమా ఇచ్చింది. ఇకపై ప్రతినాయకుడిగా ఎక్కువ కనిపించేలా ఆది పినిశెట్టి స్పీడ్ పెంచాలి. నవీన్ చంద్ర లాంటి వాళ్ళు ఇలాంటి ప్లానింగ్ తోనే వేగంగా దూసుకెళ్ళిపోతున్నారు. కానీ ఆది మాత్రం ఇంకా వెనుకబడి ఉన్నాడు. సరైనోడుతో పెద్ద బ్రేక్ ఇచ్చిన బోయపాటి శీను ఇప్పుడీ అఖండ 2లోనూ మెయిన్ విలన్ గా పెట్టి ఉంటే తన గురించి ఎక్కువ మాట్లాడుకునే అవకాశముండేది.

This post was last modified on December 13, 2025 6:01 pm

Share

Recent Posts

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

23 minutes ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

3 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

4 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

12 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

12 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

13 hours ago