కొందరు హీరోయిన్లు అసలేం మాట్లాడుతున్నారో ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. ఇప్పుడు రాధికా ఆప్టే అదే కోవలోకి వస్తోంది. బాలకృష్ణతో లెజెండ్, లయన్ లాంటి సినిమాల్లో నటించిన ఈ బాలీవుడ్ భామ కొత్త మూవీ సాలీ మొహబ్బత్ ఇటీవలే ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సందర్భంగా ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో దురంధర్ ని ఉద్దేశించి ఇన్ డైరెక్ట్ గా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. హింసని ఎంటర్ టైన్మెంట్ పేరుతో అమ్ముతున్న చోట నేను బిడ్డను పెంచలేనని, ఇలా చెప్పాల్సి వచ్చినందుకు తనకు ఎలాంటి భయం లేదని పేర్కొంది. ఫ్యాన్స్ అది దురంధర్ గురించే అంటున్నారు.
కానీ రాధికా ఆప్టే మిస్సవుతున్న లాజిక్ ఒకటుంది. ఆమె ప్రధాన పాత్ర పోషించి రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్రలో ఎంత వయొలెన్స్ ఉందో చూసిన చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. బోల్డ్ సిరీస్ లో నటించినప్పుడు, కథ డిమాండ్ పేరుతో స్కిన్ షో చేసినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం విచిత్రం. అంటే ఫామ్ లో ఉన్నప్పుడు ఒకలా ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాక మరోలా మాట్లాడ్డం గురించి నెటిజెన్లు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. లస్ట్ స్టోరీస్ లాంటి వాటిలో నటించినప్పుడు లేని పెంపక బాధ్యత ఇప్పుడు హఠాత్తుగా ఎలా పుట్టుకొచ్చిందోనని సెటైర్లు వేస్తున్నారు.
ఎలా చూసినా దురంధర్ సక్సెస్ ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు అమీర్ ఖాన్ ఇలాంటి కామెంట్స్ చేసి దేశవ్యాప్తంగా వ్యతిరేకత తెచ్చుకున్నాడు. తర్వాత డ్యామేజ్ రిపేర్ చేశారు. కానీ ఇప్పుడు రాధికా ఆప్టే అన్నవి ఆ కోణంలోకి రాకపోయినా మరీ ఇండియాలో వినోదం దిగజారిందనే తరహాలో మాట్లాడ్డం విడ్డూరం. మరి అమెరికాలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లు అత్యున్నత మానవతా విలువలతో ఉంటాయేమో అది కూడా చెబితే బాగుంటుందని పంచులు పడుతున్నాయి. ఏదైతేనేం అందరూ మర్చిపోయిన రాధికా ఆప్టే మళ్ళీ లైంలైట్ లోకి వచ్చేసింది.
This post was last modified on December 12, 2025 10:23 pm
తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక…
``ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి.. ఫలానా పార్టీతో చేతులు కలపండి!`` అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో…
ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు…
తెలుగులో చాలా వేగంగా అగ్ర కథానాయికగా ఎదిగి.. కొన్నేళ్ల పాటు ఒక వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్. కానీ వరుస…
ఎంత బ్లాక్ బస్టర్ అయినా ఒక్కోసారి రీ రిలీజులకు సరైన స్పందన రాదు. కొన్ని మాత్రం ఏకంగా రికార్డులు సాధించే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు సంబంధించిన పలు వీడియోలు.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న…