ఎంత బ్లాక్ బస్టర్ అయినా ఒక్కోసారి రీ రిలీజులకు సరైన స్పందన రాదు. కొన్ని మాత్రం ఏకంగా రికార్డులు సాధించే దిశగా ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తాయి. ప్రస్తుతం తమిళనాడులో వీరవిహారం చేస్తున్న పడయప్ప (తెలుగులో నరసింహ) ఏదో కొత్త సినిమా రేంజ్ లో హౌస్ ఫుల్స్ పెట్టడం చూసి జనం షాకవుతున్నారు. కార్తీ వా వాతియర్ వాయిదా పడటంతో దానికి కేటాయించిన స్క్రీన్లు సైతం రజని ఖాతాలోకి వచ్చేస్తున్నాయి. చెన్నైలోని రోహిణి మల్టీప్లెక్సులో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా పదిహేను వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం కొత్త రికార్డు. గతంలో విజయ్ గిల్లి పేరు మీద ఉన్న మైలురాయిని రజని తుడిపేశారు.
సుమారు 8 లక్షలకు పైగా ముందస్తు టికెట్లు అమ్ముడుపోయి ఉంటాయని చెన్నై మీడియా చెబుతోంది. బెంగళూరులో వేసిన ఎర్లీ మార్నింగ్ షోలు సోల్డ్ అవుట్ కావడం తలైవర్ క్రేజ్ కి నిదర్శనం. నిజానికి ప్రమోషన్ల విషయంలో పడయప్ప సరైన స్ట్రాటజీ పాటించలేదు. హఠాత్తుగా విడుదల నిర్ణయం తీసుకున్నారు. ట్రైలర్ ని సరిగా కట్ చేయలేదు. రజని ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూకి పూర్తి స్థాయి పబ్లిసిటీ జరగలేదు. అయినా సరే పడయప్పకు ఉండే బ్రాండ్ వేల్యూ జనాన్ని థియేటర్లకు తెస్తోంది. హైదరాబాద్ లో మల్టీప్లెక్సుల షోలతో మొదలుపెట్టి విమల్ లాంటి సింగల్ స్క్రీన్లలో వీకెండ్ షోలు ఇచ్చే దాకా వచ్చింది.
ప్రస్తుతం కోలీవుడ్ టాప్ గ్రాసర్ రీ రిలీజ్ రికార్డు గిల్లి పేరు మీద ఉంది. ఇప్పుడు పడయప్ప దాన్ని టార్గెట్ చేయొచ్చని అంటున్నారు. ఎలాగూ దగ్గర్లో ఎలాంటి పోటీ సినిమాలు లేవు. పడయప్ప తమిళ వెర్షన్ ఓటిటిలో లేదు. శాటిలైట్ ఛానల్ లో ఎప్పుడో పదేళ్లకు ఒకసారి వేస్తారు. ఏదైనా పైరసీలో దొరికితే తప్ప చూసే ఛాన్స్ లేదు. స్నేహితులే నిర్మాతలు కావడంతో రజని ఆ హక్కలను ఎవరికీ ఇవ్వకుండా చూసుకున్నారు. రజనీకాంత్ స్టైల్, ఏఆర్ రెహమాన్ సంగీతం, రమ్యకృష్ణ పాత్ర, మూడు గంటల పాటు ఉక్కిరిబిక్కిరి చేసే కమర్షియల్ కంటెంట్ వెరసి పడయప్పకు బ్రహ్మరథం దక్కడంలో ఆశ్చర్యం ఏ మాత్రం లేదు.
This post was last modified on December 12, 2025 6:02 pm
ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు…
తెలుగులో చాలా వేగంగా అగ్ర కథానాయికగా ఎదిగి.. కొన్నేళ్ల పాటు ఒక వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్. కానీ వరుస…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు సంబంధించిన పలు వీడియోలు.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ముగింపు లేని కథగా మారుతోంది. అఖండ 2 జిఓని రద్దు చేస్తూ నిన్న హైకోర్టు…
గత వారం విడుదలైన దురంధర్ స్టడీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 లాంటి క్రేజీ రిలీజ్ ఉన్నా సరే…
రాజకీయాల్లో తప్పులు చేయడం సహజం. వాటిని సరిదిద్దుకునేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు నడవడం కీలకం!. ఇది కేంద్రం నుంచి రాష్ట్రం…