ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల రన్ ఇవ్వలేకపోయాయి. క్లోజయ్యే నాటికి కేవలం ముప్పై కోట్ల దగ్గర ఆగిపోయిన ఈ ఫ్యాన్ ఎమోషనల్ డ్రామా నిజానికి ఇండస్ట్రీని సైతం ఆశ్చర్యపరిచింది. మైత్రి లాంటి పెద్ద నిర్మాణ సంస్థ, ప్రొడక్షన్ వాల్యూస్, ఉపేంద్ర లాంటి ప్రామిసింగ్ ఆర్టిస్ట్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, వీటితో పాటు కోరి మరీ మలయాళం నుంచి తెచ్చుకున్న సంగీత దర్శకులు వివేక్ – మెర్విన్ ఏదీ పని చేయలేదు. దర్శకుడు మహేష్ బాబు ఉద్దేశం మంచిదే అయినా అది జనాలకు రీచ్ కావడంలో విఫలమయ్యింది.
ఇక రామ్ తనను తాను విశ్లేషించుకునే టైం వచ్చింది. ఫ్లాపులు ఎవరికైనా వస్తాయి. అఖండ నుంచి నాలుగు బ్లాక్ బస్టర్లు సాధించిన బాలయ్య దాని కన్నా ముందు ఎలాంటి సినిమాలు ఇచ్చారనేది చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. భోళా శంకర్ కొట్టిన దెబ్బ చిరంజీవిని ఏకంగా రెండేళ్లు తెరకు దూరంగా ఉంచేసింది. నాగార్జున విలన్ గా ట్రై చేసేందుకు డిజాస్టర్లు ప్రేరేపించిన మాట వాస్తవం. ఒక్క గేమ్ ఛేంజర్ రామ్ చరణ్ మీద తెచ్చిన నెగటివిటిని మర్చిపోకూడదు. వార్ 2 విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎదురుకున్న అనుభవమూ అదే. కానీ రామ్ కేసు వేరు. వాళ్ళలాగా వేగంగా బౌన్స్ బ్యాక్ అయ్యేంత మార్కెట్ తనకు లేదు.
నేను శైలజ లాంటి తనకు సూటయ్యే ఫ్యామిలీ అండ్ లవ్ జానర్ కి దూరంగా జరగడం రామ్ చేసిన పొరపాటు. సూటవ్వని ఓవర్ మాస్ తో చేసిన స్కంద, వారియర్, రెడ్, డబుల్ ఇస్మార్ట్ లాంటి ప్రయోగాలు బెడిసి కొట్టాయి. దీనికి కారణం ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ కావడమే. దాని హ్యాంగోవర్ లోనే అవసరానికి మించిన కమర్షియల్ జానర్ లోకి వెళ్ళిపోయి దెబ్బలు తిన్నాడు. నెక్స్ట్ హారర్ వైపు చూస్తున్నాడని టాక్ ఉంది. కొత్త దర్శకుడు హ్యాండిల్ చేయొచ్చని అంటున్నారు. సముతిరఖని కూడా ఒక కథ చెప్పాడట. వీటిలో ఒకదానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ త్వరలో రావొచ్చు. చూడాలి ఈసారి ఏం చేయబోతున్నాడో.
This post was last modified on December 12, 2025 7:33 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…