భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కానీ దానికి సహేతుకమైన కారణం ఆమోదం దక్కుతుంది. సోషల్ మీడియా కాలంలో దీని పట్ల ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. హృతిక్ రోషన్ దానికి ఉదాహరణగా నిలుస్తున్నాడు. ఇటీవలే విడుదలైన దురంధర్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. సినిమా చూసిన హృతిక్ తన ఇన్స్ టా స్టేటస్ లో టీమ్ మీద పొగడ్తలు కురిపిస్తూనే దురంధర్ లో చూపించిన రాజకీయాల గురించి మాట్లాడనని, ఫిలిం మేకర్స్ బాధ్యతల గురించి చర్చించేందుకు ఇది సందర్భం కాదని పేర్కొన్నాడు. నిజానికివి చాలా పెద్ద మాటలు.
ఎందుకంటే దురంధర్ లో చూపించింది మన దేశ రాజకీయాలు కాదు. పాకిస్థాన్ మాఫియా గుప్పిట్లో ఉన్న అక్కడి పాలిటిక్స్ గురించి. అది తప్పో ఒప్పో తేల్చాల్సింది చరిత్రకారులు. దర్శకుడు ఆదిత్య ధార్ చాలా పరిశోధన చేసి స్క్రిప్ట్ రాసుకున్నాడు. డిటైలింగ్ అంత పర్ఫెక్ట్ గా ఉండటం వల్లే థాయ్ లాండ్ లో వేసిన లయారి సెట్ నిజంగానే పాక్ లో తీశారా అనేంత సహజంగా ఉంది. ఫ్లైట్ హైజాక్, ముంబై దాడులు, పార్లమెంట్ అటాక్ ఇలా అన్ని అంశాలను చాలా బాలన్స్ గా చూపించాడు ధార్. అలాంటప్పుడు హృతిక్ వాడిన బాధ్యత, రాజకీయాలు లాంటి పదాలు నెటిజెన్ల ఆగ్రహానికి గురవ్వడం సహజం.
డ్యామేజ్ గుర్తించిన హృతిక్ రోషన్ తాజాగా పెట్టిన ట్విట్టర్ పోస్టులో మ్యాటర్ మార్చేసి నటీనటులకు సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు చెప్పాడు. దురంధర్ మీద ఆన్ లైన్ జనాలు రెండుగా విడిపోయిన మాట వాస్తవం. అయితే వార్ లాగా ఎలివేషన్లు లేకుండా నిజాయితీగా పాక్ మాఫియాని నగ్నంగా చూపించడం హృతిక్ ని నచ్చలేదేమోనని కొందరు సెటైర్లు వేశారు. అయినా యునానిమస్ టాక్ తెచ్చుకున్నాక కొన్ని బాలీవుడ్ హ్యాండిల్స్ ఎంత నెగటివ్ గా ప్రచారం చేస్తున్నా దాని ప్రభావం దురంధర్ వసూళ్ల మీద పడటం లేదు అంతేమరి కంటెంట్ బాగున్నప్పుడు ఆడియన్స్ ఇవన్నీ పట్టించుకోరు.
This post was last modified on December 11, 2025 10:18 am
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…