గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఆ వివాదాన్ని పరిష్కరించుకుని ఈ నెల 12న సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంది నిర్మాణ సంస్థ. కొంచెం హడావుడి అయినా సరే.. చకచకా విడుదలకు ఏర్పాట్లు చేశారు. గురువారం సెకండ్ షో నుంచే సినిమాకు ప్రిమియర్స్ పడిపోతున్నాయి. వాయిదా వల్ల ఆర్థికంగా ఇటు నిర్మాతలు.. అటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కొంత నష్టపోయిన మాట వాస్తవం.
కానీ దాన్ని కవర్ చేయగల సత్తా సినిమాకు ఉందని అందరూ ధీమాగా ఉన్నారు. అర్ధంతరంగా రిలీజ్ ఆగిపోయిన దగ్గర్నుంచి ‘అఖండ-2’ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. సినిమాకు హైప్ ఏమాత్రం తగ్గకపోగా.. ఇంకా పెరిగింది అంటే అతిశయోక్తి కాదు. కొత్త డేట్ అనౌన్స్ చేశాక ప్రిమియర్స్‌కు మధ్య రెండు రోజుల సమయమే మిగిలింది. అయినా బుకింగ్స్ విషయంలో పెద్దగా ఇబ్బంది లేనట్లే కనిపిస్తోంది.
మామూలుగా ఓవర్సీస్ ప్రిమియర్స్‌కు కొన్ని వారాల ముందు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెడతారు. టికెట్ల అమ్మకాలు నెమ్మదిగా సాగుతాయి. కానీ రెండు రోజుల గ్యాప్‌లో టికెట్ల అమ్మకాలు మొదులపెట్టినా సరే.. యమ స్పీడుగా జరుగుతున్నాయి. తక్కువ గ్యాప్ ఉండడం వల్ల ప్రిమియర్స్‌కు ఏమాత్రం స్పందన వస్తుందో అన్న అనుమానాలు పటాపంచలైపోయాయి. యుఎస్ షోలు చాలా వరకు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్‌కు ఢోకా లేనట్లే కనిపిస్తోంది.
ఏపీలో ఆల్రెడీ జోరుగా బుకిింగ్స్ జరుగుతున్నాయి. నైజాం బుకింగ్స్ మొదలుపెట్టాల్సి ఉంది. వాటికీ మంచి స్పందనే వస్తుందని ఆశిస్తున్నారు. మొత్తంగా పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది. టీం కొత్తగా పబ్లిసిటీ మీద ఖర్చు పెట్టాల్సిన అవసరమేమీ కనిపించడం. కొత్తగా ఈవెంట్లు, ఇంటర్వ్యూలేమీ ప్లాన్ చేయలేదు. కానీ రిలీజ్ ముంగిట ఒక కొత్త ట్రైలర్ మాత్రం వదలాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయం ఆ ట్రైలర్ రావచ్చని అంటున్నారు. పవర్ ఫుల్ డైలాగులతో ఈ రిలీజ్ ట్రైలర్ వదలాలని చూస్తున్నాడట దర్శకుడు బోయపాటి.
This post was last modified on December 10, 2025 2:55 pm
గత రెండు రోజులుగా ఇటు సోషల్ మీడియాలోను, అటు ప్రధాన మీడియా ఛానెళ్లలోను.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం.. ప్రపంచ…
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…