రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ‘యురి’ దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన సినిమా.. దురంధర్. ప్రోమోలు చూస్తే ఇది బాలీవుడ్లో మరో ‘యానిమల్’ అవుతుందనే అంచనాలు కలిగాయి. కానీ రిలీజ్ ముంగిట ఈ సినిమాకు మరీ హైప్ ఏమీ కనిపించలేదు. కొన్ని కారణాల వల్ల నెగెటివిటీ కూడా ముసురుకుంది. ఏకంగా రూ.350 కోట్లు పెట్టి తీసిన సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో అన్న సందేహాలు కలిగాయి.
ఈ చిత్రం కోసం దర్శకుడు ఆదిత్య ధర్ ప్రాణం పెట్టేశాడు. దీనికి నిర్మాత కూడా అతనే. హీరో రణ్వీర్ సింగ్ సైతం కెరీర్లో మరే చిత్రానికీ పడనంత కష్టం ఈ చిత్రానికి పడ్డాడు. దీంతో వీళ్ల కష్టానికి ఆశించిన ఫలితం వస్తుందా రాదా అనే చర్చ జరిగింది రిలీజ్ ముంగిట. కానీ ‘దురంధర్’ బాక్సాఫీస్ దగ్గర బలంగానే నిలబడ్డాడు. తొలి రోజు ఇండియాలో రూ.28 కోట్ల మేర వసూళ్లు రావడంతో హమ్మయ్య అనుకుంది టీం.
తర్వాతి రెండు రోజుల్లో ఇంకా వసూళ్లు పెరిగాయి. వీకెండ్లోనే ఇండియాలో వంద కోట్లకు పైగా కొల్లగొట్టింది ‘దురంధర్’. ఐతే వారాంతంలో జోరు చూపించే చాలా సినిమాలు.. వీక్ డేస్ రాగానే వీక్ అయిపోవడం మామూలే. కానీ ‘దురంధర్’ మాత్రం సోమవారం కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇండియాలో నాలుగో రోజు రూ.24.30 కోట్లు కొల్లగొట్టింది ఈ చిత్రం. సోమవారం ఇలాంటి వసూళ్లు రాబట్టిందంటే సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోవచ్చు.
వరల్డ్ వైడ్ ఈ సినిమా వసూళ్లు రూ.180 దాకా ఉన్నాయి. మంగళవారం ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టబోతోంది. ఐతే ఈ సినిమా టార్గెట్ పెద్దది కాబట్టి నెలాఖరు వరకు బాగా ఆడాల్సిందే. హిందీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారంటే కొన్ని వారాల పాటు సినిమా ఆడుతుందనడంలో సందేహం లేదు. ఫుల్ రన్లో ఈ సినిమా వసూళ్లు రూ.400-500 కోట్ల మధ్య రావచ్చని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు.
This post was last modified on December 9, 2025 7:03 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…