గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈరోస్ సంస్థతో తలెత్తిన వివాదం పరిష్కారం కావడంతో కోర్ట్ ఆర్డర్ రాగానే విడుదల తేదీని ప్రకటించేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నట్టు సమాచారం. అనధికారికంగా డిస్ట్రిబ్యూటర్లకు డిసెంబర్ 12కి సిద్ధం కమ్మని సమాచారం వెళ్లిందట. ముందు రోజు రాత్రి ప్రీమియర్లు ఉంటాయని, టికెట్ ధరలు తదితర వ్యవహారాలన్నీ పదో తేదీకల్లా కొలిక్కి వస్తాయని చెబుతున్నారు. ప్రొడ్యూసర్లు మాత్రం డిసెంబర్ 25 వైపే సానుకూలంగా ఉన్నారట కానీ పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు.
ఇప్పటికైతే అఖండ 2కి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కానీ విశ్వసనీయ సమాచారమైతే 12 అనే ఉంది. ఏదైనా అనూహ్య మార్పు ఉంటే 25 కావొచ్చు. 14 రీల్స్ నిర్ణయం కోసమే పన్నెండో తేదీ రిలీజవుతున్న మోగ్లీ, ఈషా, సైక్ సిద్దార్థ్ ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ అఖండ 2 వచ్చే పక్షంలో ఒకటో రెండో వాయిదా వేసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే థియేటర్ల కొరత వచ్చే అవకాశంతో పాటు బాలయ్య మేనియాలో జనాలు వీటి మీద ఆసక్తిగా చూపించకపోయే ప్రమాదం ఉంది. ఫ్యాన్స్ మాత్రం మళ్ళీ సంబరాలకు రెడీ అవుతున్నారు. పదకొండు తేదీ రాత్రి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని ప్లానింగ్ చేసుకుంటున్నారు.
అసలే థియేటర్లు జనాలు లేక వెలవెలబోతున్నాయి. అఖండ 2 తప్పుకోవడం దురంధర్ కు పెద్ద వరంగా మారింది. ఆంధ్రకింగ్ తాలూకా కొంత పికప్ చూపించినప్పటికీ సూపర్ హిట్ దిశగా వెళ్లేందుకు సరిపోవడం లేదు. చాలా మల్టీప్లెక్సుల్లో అన్ని స్క్రీన్లు రన్ చేయడం లేదు. కంటెంట్ కొరత కారణంగా జనాలు కాస్తయినా వచ్చే సినిమాలు మాత్రం వేస్తున్నారు. సింగల్ స్క్రీన్ల పరిస్థితి సైతం దీనికి భిన్నంగా ఏమి లేదు. మరి అఖండ 2 గుడ్ న్యూస్ రేపు ఏ సమయంలో వస్తుందనేది వేచి చూడాలి. ఫ్యాన్స్ మాత్రం టెన్షన్ తో ఉన్నారు. కొబ్బరికాయ మొక్కులు, ప్రదక్షిణలు, హోమాలు గట్రా చేస్తున్నారు.
This post was last modified on December 8, 2025 10:33 pm
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…
వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ తీవ్రంగా కుదుపునకు గురైందని సీఎం చంద్రబాబు చెప్పారు. జగన్ దెబ్బకు ఏపీ బ్రాండ్ కదిలిపోయింది.…