Movie News

డిసెంబర్ 12 – పోటీ గట్టిగానే ఉంది గురూ

మొన్న శుక్రవారం రావాల్సిన అఖండ 2 వాయిదా పడటంతో థియేటర్లు బోసిపోతున్నాయి. ఉన్నంతలో ఆంధ్రకింగ్ తాలూకా, రాజు వెడ్స్ రాంబాయి, దురంధర్ ఏదో నెట్టుకొస్తున్నాయి కానీ చాలా స్క్రీన్లు తాత్కాలికంగా మూసేయాల్సి వచ్చింది. ఫీడింగ్ కోసం తేరే ఇష్క్ మే డబ్బింగ్ వెర్షన్ అమర కావ్యంకి షోలు పెంచినప్పటికీ అసలది వచ్చిన సంగతే చాలా మంది ఆడియన్స్ కి రిజిస్టర్ కాలేదు. ఇప్పుడు అందరి కన్ను డిసెంబర్ 12 మీదకు వెళ్తోంది. ఎందుకంటే చెప్పుకోదగ్గ స్థాయిలో కంటెంట్ ఉన్న సినిమాలు పోటీకి దిగుతున్నాయి. కౌంట్ పైకి ఎనిమిది దాకా కనిపిస్తోంది కానీ బజ్ పరంగా చూసుకుంటే నాలుగే హైలైట్ అవుతున్నాయి.

కార్తీ ‘అన్నగారు వస్తారు’గా ఎంట్రీ ఇస్తున్నాడు. దీనికి కూడా ఆర్థిక సమస్యల వల్ల పోస్ట్ పోన్ కావొచ్చనే ప్రచారం జరిగింది కానీ నిర్మాతలు వాటిని ఖండిస్తూ ప్రమోషన్లు యథావిధిగా కొనసాగిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ గా కార్తీ ఇందులో వినోదాత్మక పాత్రను పోషించాడు. సురేష్ సంస్థ భాగస్వామి కావడం వల్ల ‘సైక్ సిద్దార్థ్’ మీద క్రమంగా అటెన్షన్ వస్తోంది. హీరో నందు గ్యారెంటీగా మెప్పిస్తానని హామీ ఇస్తున్నాడు. కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ రూపొందించిన ‘మోగ్లీ’ మీద హీరోగా నటించిన సుమ కొడుకు రోషన్ కనకాల బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. పబ్లిసిటీ అయితే మొదలయ్యింది కానీ జనానికిఇంకా రీచవ్వాలి.

బన్నీ వాస్, వంశీ నందిపాటి, దామోదర్ ప్రసాద్ సంయుక్తంగా అందిస్తున్న హారర్ మూవీ ‘ఈషా’ మీద క్రమంగా ఆసక్తి పెరిగేలా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. స్టార్లు లేరు కాబట్టి కంటెంట్ మీదే ఆధారపడ్డారు. ఇవి కాకుండా ఘంటసాల, మిస్టీరియస్, నా తెలుగోడు, ఇట్స్ ఓకే గురు అనే మరో నాలుగు సినిమాలు పోటీలో ఉన్నాయి. వీటికి అద్భుతమైన టాక్ వస్తేనే నిలబడతాయి. అఖండ 2 ఈ వారం వస్తుందో రాదో ఇంకా అయోమయం తీరని నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ చెప్పిన సినిమాలు డిసెంబర్ 12కే కట్టుబడ్డాయి. చివరి నిమిషంలో ఏమైనా అనూహ్యమైన పరిణామాలు జరిగితే తప్ప ఈ వరుసలో మార్పుండదు.

This post was last modified on December 8, 2025 12:50 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మీ ఆవిడ ఇండియన్ కాదా? US వైస్ ప్రెసిడెంట్ కు షాక్

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ వలసదారుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి.…

12 minutes ago

‘వందేమాతరం – నెహ్రూ’ : ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లో సోమ‌వారం.. జాతీయ గేయం వందేమాత‌రంపై చ‌ర్చ జ‌రిగింది. ఈ గేయానికి 150 సంవ‌త్స‌రాలు పూర్త‌యిన నేప‌థ్యాన్ని…

30 minutes ago

స్టార్‌లింక్ రేట్లు వచ్చేశాయ్… నెలకు ఎన్ని వేలో తెలుసా?

ఎలన్ మస్క్ కంపెనీ 'స్టార్‌లింక్' ఎప్పుడెప్పుడు ఇండియాకు వస్తుందా అని టెక్ లవర్స్ అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ…

43 minutes ago

స్కూల్లో ఉన్నపుడే టీచర్‌తో హీరోయిన్ ప్రేమాయణం

హీరోయిన్లు సినీ రంగంలోకి వచ్చాక వారి ప్రేమాయణం గురించి రూమర్లు వినిపించడం మామూలే. వాటి గురించి ఓపెన్ అయ్యేవాళ్లు తక్కువమంది.…

1 hour ago

శ్రీను వైట్ల సినిమా మామూలుగా ఉండదట

ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…

3 hours ago

నవ్వించి ఏడిపించి ఇప్పుడు భయపెడుతున్నారు

లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…

4 hours ago