Movie News

‘అఖండ’మైన నిర్ణయం తీసుకునే టైమొచ్చింది

అఖండ 2 తాండవం విడుదల వాయిదా పడ్డాక కొత్త డేట్ కోసం అభిమానుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది. అధిక శాతం డిసెంబర్ 12 డిమాండ్ చేస్తుండగా అంత తక్కువ వ్యవధిలో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవడం గురించి నిర్మాతలు తర్జన భర్జన పడుతున్నారు. సమస్య పరిష్కారమయ్యింది కానీ ఇంకా కోర్టు ఉత్తర్వులు రావాల్సి ఉంది. అవి చేతికి అందగానే ప్రీమియర్ షోలకు మళ్ళీ రెండు ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకోవాలి. డిస్ట్రిబ్యూటర్లతో డీల్ మాట్లాడుకోవాలి. అదే రోజు మోగ్లీ, సైక్ సిద్దార్థ్, ఈషా, అన్నగారు వస్తారు లాంటి కొత్త రిలీజులున్నాయి. వీటిలో ఏవి తప్పుకుంటాయో ఇంకా క్లారిటీ లేదు.

ప్రొడ్యూసర్ల కోణంలో డిసెంబర్ 25 సేఫ్ గేమ్ అవుతుందని భావిస్తున్నారట. అయితే ఛాంపియన్, శంబాల వాయిదా వేసుకునే మూడ్ లో లేవు. ఎందుకంటే అగ్రిమెంట్లు, ఓటిటి డీల్స్ అన్నీ అయిపోయాయి. వాటి హీరోలు బాలయ్యతో పోల్చుకునే స్థాయి కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరినీ తక్కువంచనా వేయడానికి లేదు. ఛాంపియన్ నిర్మాతలు వైజయంతి సంస్థ కావడంతో డిస్ట్రిబ్యూషన్ పరంగా మంచి మద్దతు దక్కుతుంది. పైగా డిసెంబర్ 19న వచ్చే అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఏ సెంటర్స్, మల్టీప్లెక్సుల్లో దాని కాంపిటీషన్ తో చిక్కులు తప్పవు.

ఇవన్నీ చూసుకునే ఫ్యాన్స్ డిసెంబర్ 12 కావాలంటున్నారు. థియేటర్ల దగ్గర డిసెంబర్ 5 చేసిన అలంకరణ, బ్యానర్లు, లైటింగ్ అంతా అలాగే ఉంచేశారు. వేరే సినిమాలు ఆడుతున్నా సరే డెకరేషన్ తీసేయొద్దని ఓనర్లను రిక్వెస్ట్ చేసుకున్నారు. తక్కువ గ్యాప్ లో వస్తుందనే నమ్మకంతో అలా అంటున్నారు. అయితే రేపు సాయంత్రానికి దీని గురించి క్లారిటీ రావొచ్చని టాక్. నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు, డిస్ట్రిబ్యూటర్ల ప్రతినిధుల మధ్య దీని గురించే చర్చ జరిగింది కానీ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించడం లాంటివి చేయలేదు. ఏదేమైనా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకునే టైం అయితే వచ్చేసింది.

This post was last modified on December 8, 2025 10:22 am

Share

Recent Posts

వంగ్ టచ్ చేస్తే వైరలే…

కేవలం మూడే మూడు సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో హాట్ షాట్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ రెడ్డి వంగ. తన…

5 hours ago

గాంధీ దృష్టి పెట్టాల్సిన కొరియన్ పాయింట్లు

కొరియన్ కనకరాజు బాక్సాఫీస్ దగ్గర హిట్టు కొట్టేసింది. రీజనబుల్ బిజినెస్ చేయడం వల్ల మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ దాటేసి…

5 hours ago

కొండంత బలం తెచ్చుకున్న యువి

ఎంత అగ్ర నిర్మాణ సంస్థ అయినా వరసగా కాకపోయినా కొంచెం గ్యాప్ తో అయినా హిట్లు పడుతూ ఉంటే ప్రొడక్షన్…

7 hours ago

ప్రేమకథల నుంచి ప్యాన్ ఇండియాకు

యూత్ హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపు మీదున్నాడు. చెన్నై లవ్ స్టోరీ సూపర్ సక్సెస్ కావడం తనకు మాములు…

8 hours ago

వామిక టాలెంట్… మొత్తం తోడేశారు

సినిమా పరిశ్రమలో బ్రేక్ దక్కాలన్నా సక్సెస్ కొట్టాలన్నా టైం కలిసి రావాలి. కాకపోతే అది ఎప్పుడు వస్తుందో ఎవరు ఆ…

9 hours ago

నిన్న అఖిల్… ఇప్పుడు వరుణ్ తేజ్

యూత్ హీరోలు అందులోనూ బలమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుర్రాళ్లకు సక్సెస్ లేకపోతే మహా ఇబ్బందవుతుంది. సినిమాలు తీసే నిర్మాతలు…

10 hours ago